పార్లమెంటులో ప్లాస్టిక్ నిషేధిస్తూ లోక్సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ సంబంధిత వస్తువులు, బాటిల్స్ వాడరాదని అధికారులు, అనుబంధ సంస్థ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా బయోడీగ్రేడబుల్ వస్తువులను ఉపయోగించాలని సూచించింది.
ప్రధాని పిలుపుతో పార్లమెంటులో ప్లాస్టిక్ నిషేధం
పార్లమెంటులో ప్లాస్టిక్ వాడటాన్ని నిషేధిస్తున్నట్లు లోక్సభ సచివాలయం ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది.
ప్రధాని పిలుపుతో పార్లమెంటులో ప్లాస్టిక్ నిషేధం
ప్లాస్టిక్ వాడొద్దని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలను కోరారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:పెళ్లి వయసుపై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు
Last Updated : Sep 27, 2019, 4:51 PM IST