వేతన కోడ్-2019 బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ప్రతి కార్మికుడికి కనీసం వేతనం, జీతాలు చెల్లించటంలో జాప్యం వంటి సమస్యలకు పరిష్కంచేందుకు రూపొందించిన వేతన కోడ్ బిల్లు-2019 దిగువసభలో నెగ్గింది.
వేతనాలు, బోనస్ వంటి కార్మికులకు చెందిన చట్టాల సవరణకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. బిల్లుపై చర్చలో భాగంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ మాట్లాడారు.
"ఈ బిల్లుతో 50 కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. కనీస వేతన చట్టం, వేతనాల చెల్లింపుల చట్టం, బోనస్ చెల్లింపుల చ్టటం, సమాన వేతన చట్టాన్ని కలిపి ఈ నూతన బిల్లు రూపొందించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ కనీస వేతన పథకాన్ని అమలుచేస్తాం."