తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీచర్​పై నుంచి దూసుకెళ్లిన లారీ- ప్రమాదమా? హత్యా? - క్రిస్టే అగస్టారాణి

తమిళనాడు సేలంలో వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొనడం వల్ల క్రిస్టే అగస్టా రాణి అనే ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన వెనుక హత్యకు కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

టీచర్​పై నుంచి దూసుకెళ్లిన లారీ- ప్రమాదమా? హత్యా?

By

Published : Jun 20, 2019, 3:11 PM IST

Updated : Jun 20, 2019, 3:29 PM IST

టీచర్​పై నుంచి దూసుకెళ్లిన లారీ- ప్రమాదమా? హత్యా?

తమిళనాడు సేలంలో టిప్పర్​ లారీ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలిపై నుంచి దూసుకెళ్లింది. ఆమె అక్కడికక్కడే మరణించారు.

సేలంలోని ఒమలూరులో జైసింగ్​, అతని భార్య క్రిస్టే అగస్టా రాణి కలిసి జీవిస్తున్నారు. క్రిస్టే ఓ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఇవాళ ఆమె ఓ విద్యార్థితో రోడ్డు పక్కగా నడిచివెళ్తున్నారు. ఒక్కసారిగా వెనుక నుంచి దూసుకొచ్చిన టిప్పర్ లారీ ఆమెను బలంగా ఢీకొట్టింది. క్రిస్టే బండి చక్రాల కింద నలిగిపోయి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

కుట్ర జరిగిందా..?

ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే ఈ దుర్ఘటన వెనుక కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: వైరల్​: పూజ చేస్తుండగా చీరకు నిప్పు

Last Updated : Jun 20, 2019, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details