తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభ ఎన్నికల బరిలో మిజోరం గవర్నర్​!

మిజోరం గవర్నర్​ కుమ్మనమ్​ రాజశేఖరన్​ తన పదవికి రాజీనామా చేశారు. రానున్న లోక్​సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

మిజోరాం గవర్నర్ రాజీనామా

By

Published : Mar 9, 2019, 7:49 AM IST

మిజోరం గవర్నర్​ కుమ్మనమ్​ రాజశేఖరన్శుక్రవారం​తన పదవికి రాజీనామా చేశారు. 10 నెలల క్రితమే గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన ఆయన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికిఅందజేశారు. రామ్​నాథ్​ కోవింద్​ రాజశేఖరన్​ రాజీనామాకు ఆమోదం తెలిపారని రాజ్​భవన్​ అధికార ప్రతినిధి ప్రకటించారు. గతేడాది మే 25న మిజోరం గవర్నర్​గా రాజశేఖరన్​ బాధ్యతలు చేపట్టారు.

తిరువనంతపురం నుంచి పోటీ!

రానున్న లోక్​సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా కేరళలోని తిరువనంతపురం నుంచి పోటీ చేసే ఆలోచనలో రాజశేఖరన్​ ఉన్నారని సమాచారం. ఈ విషయంపై అటు భాజపా, ఇటు రాజశేఖరన్​ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కేరళకు సంబంధించి లోక్​సభ అభ్యర్థులనూ ప్రకటించలేదు.

ముక్కోణ పోరు తప్పదా...

ఒకవేళ రాజశేఖరన్​ తిరువనంతపురం నుంచి పోటీ చేస్తే 'లెఫ్ట్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​(ఎల్​డీఎఫ్​)', 'యునైటెడ్​ డెమొక్రటిక్​ ఫ్రంట్​(యూడీఎఫ్​)', 'భాజపా' మధ్య ముక్కోణ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్​-యూడీఎఫ్​ కూటమి అభ్యర్థిగా శశిథరూర్​ మూడోసారి ఈ స్థానం నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details