తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోక్​సభ నిరవధిక వాయిదా- పార్లమెంటు సమావేశాలు పూర్తి

Lok Sabha adjourned sine die
లోక్​సభ నిరవధిక వాయిదా

By

Published : Sep 23, 2020, 8:45 PM IST

Updated : Sep 23, 2020, 9:20 PM IST

21:01 September 23

పార్లమెంటు ‌వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో నిర్ణయించిన షెడ్యూల్​ కంటే 8 రోజుల ముందుగానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మధ్యాహ్నమే నిరవధిక వాయిదా పడగా.. ఇవాళ సాయంత్రం సమావేశమైన లోక్​సభ జీరో అవర్​ తర్వాత వాయిదా పడింది. అంతకుముందు మేజర్​ పోర్ట్​ అథారిటీ బిల్లును కేంద్రం దిగువసభలో ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. 10 రోజులు జరిగిన వర్షాకాల సమావేశాల్లో మొత్తం 25 బిల్లులను ఆమోదించింది లోక్​సభ.   

అక్టోబర్ ‌1 వరకు సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీ.. కొవిడ్ ‌వ్యాప్తి దృష్ట్యా ముందే ముగించాలని అన్ని పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఉభయసభలను వాయిదా వేశారు. 

రాజ్యసభలో ఇవాళ పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రతకు సంబంధించిన మూడు కార్మిక సంస్కరణ బిల్లులకు ఆమోదం లభించింది. ఈ బిల్లులకు లోక్‌సభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లో రాజ్యసభ 25 బిల్లులకు ఆమోదం తెలిపింది. 

20:42 September 23

లోక్​సభ నిరవధిక వాయిదా-ముగిసిన పార్లమెంటు సమావేశాలు

లోక్​సభ నిరవధిక వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో ఈ సారి వర్షాకాల సమావేశాలను కుదించారు. మధ్యాహ్నమే రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. 

కరోనా కారణంగా నిర్ణయించిన షెడ్యూల్​ కంటే 8 రోజులు ముందుగానే సమావేశాలు ముగిశాయి. 

Last Updated : Sep 23, 2020, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details