దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్ కారణంగా రైతులు ఇబ్బందిపడకుండా కేంద్రప్రభుత్వం వారికి ఊరట కల్పించింది. రైతులు, రైతు కూలీలకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా. పంట పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు లాక్‌డౌన్ వర్తించవని పేర్కొన్నారు.
రైతన్నలకు ఊరట.. లాక్‌డౌన్ వర్తించదు - corona lockdown
లాక్‌డౌన్ నుంచి రైతన్నలకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. పంటపొలాల్లో పనిచేసే రైతులు, కూలీలకు లాక్‌డౌన్ వర్తించదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఎరువుల దుకాణాలు, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తయారుచేసి ప్యాకింగ్ చేసే యూనిట్లు, వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇచ్చే కేంద్రాలకు మినహాయింపు ఇచ్చింది కేంద్రం.
ఎరువుల దుకాణాలు, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు తయారుచేసి ప్యాకింగ్ చేసే యూనిట్లు, వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇచ్చే కేంద్రాలకు లాక్‌డౌన్ నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. కనీస మద్దతు ధరతోపాటు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణను చేపట్టే సంస్ధలు, రాష్ట్రప్రభుత్వాలు నోటిఫై చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు నిర్వహించే మండీలకు కూడా లాక్‌డౌన్ వర్తించదు. పనులు లేక సొంతూళ్లకు గుంపులుగా వెళ్తున్న వలస కార్మికులకు అండగా నిలవాలని, వారు ఉన్నచోటే ఆహారం, ఆశ్రయం కల్పించాలని కేంద్రం సూచించింది.