తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా నివారణకు లాక్‌డౌన్ పరిష్కారం కాదు: రాహుల్‌ - RAHUL LATEST NEWS

కరోనాపై పోరాటానికి లాక్​డౌన్​ మార్గం కాదని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అభిప్రాయపడ్డారు. వైరస్​ను పారదోలాలంటే దేశంలో కరోనా పరీక్షలను గణనీయంగా పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం వ్యూహాత్మకంగా కరోనా పరీక్షలు జరగడం లేదని రాహుల్​ అన్నారు.

RAHUL GANDHI
రాహుల్​ గాంధీ

By

Published : Apr 16, 2020, 1:32 PM IST

దేశంలో లాక్​డౌన్​ విధించాక తొలిసారి కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్​ నియంత్రణపై పలు సూచనలు చేశారు. కరోనా వైద్యపరీక్షలు గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్​. ర్యాండమ్‌ పద్ధతిలో కరోనా వైద్యపరీక్షలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతం వ్యూహాత్మకంగా కరోనా వైద్య పరీక్షలు జరగట్లేదు. కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కరోనా నివారణకు లాక్‌డౌన్ పరిష్కారం కాదు. లాక్​డౌన్​ తర్వాత కరోనా వైరస్‌ మళ్లీ విజృంభించే ప్రమాదం ఉంది. లాక్‌డౌన్‌... కరోనా వైరస్‌ వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుంది.

కేరళ వయనాడ్‌లో కరోనా నియంత్రణ సమర్థంగా జరుగుతోంది. కేరళలో జిల్లా స్థాయి వైద్య పరికరాలతో సమర్థంగా కట్టడి చేస్తున్నారు.

-రాహుల్‌గాంధీ, కాంగ్రెస్​ నేత

లాక్​డౌన్​ కారణంగా వలస కూలీలు, పేదలు ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రాహుల్.

ABOUT THE AUTHOR

...view details