రెండు దశల లాక్డౌన్లో పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. మూడో దశలో మాత్రం దేశాన్ని జోన్ల వారీగా విభజించి పలు షాపులు తెరిచేందుకు అనుమతించింది. ఇందులో మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే షాపుల వద్ద ఎక్కువ మంది గుమిగూడుతున్న నేపథ్యంలో ఆన్లైన్లో లిక్కర్‌ను అందుబాటులో ఉంచేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఈ దిశగా ఛత్తీస్‌గఢ్ సర్కారు ఒకడుగు ముందుంది. ఆన్లైన్ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించింది. గ్రీన్ జోన్లలో ఉన్నవారు ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మందు ఇంటికే వచ్చే ఏర్పాటు చేసింది.
వెబ్సైట్ ద్వారా..
మార్చి 23 అనంతరం సోమవారమే మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్లకు వరుస కట్టారు మందుబాబులు. ఇలా జనం గుమిగూడితే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉన్న కారణంగా ఆన్లైన్లో అమ్మకాలకు తెరతీసింది ఛత్తీస్‌గఢ్ సర్కారు. csmcl.in అనే వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మద్యాన్ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది.
రాయ్‌పుర్, కోర్బా మినహా మిగతా అన్ని జిల్లాల్లో ఈ సేవలను అందించనుంది ఛత్తీస్‌గఢ్ సర్కారు. ఈ ప్రత్యేక సేవల కోసం మొబైల్, ఆధార్ నెంబర్, అడ్రెస్‌లను ఇవ్వాల్సి ఉంటుంది. వన్ టైం పాస్వర్డ్ ద్వారా ఆన్లైన్ బుకింగ్‌లు తీసుకుంటారు. ఒక్కసారి 5 లీటర్ల మద్యాన్ని ఆర్డర్ చేయవచ్చు. డెలీవరీ ఛార్జీగా రూ. 120 వసూలు చేస్తారు.
ఒక్క క్లిక్‌తో మీ ముందుకు.. రాజస్థాన్‌లో కూపన్లు..
రాజస్థాన్‌లో మద్యం కొనుగోళ్లకు ప్రత్యేక కూపన్లు జారీ చేస్తోంది ప్రభుత్వం. పెద్ద క్యూలైన్లలో నిల్చుని.. భౌతిక దూరం నిబంధనలను మరచిపోతున్న నేపథ్యంలో ఈ కూపన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఆయా కూపన్లలో కేటాయించిన సమయంలోనే షాపుకెళ్లి మద్యం కొనుగోళ్లు చేయవలసి ఉంటుంది. అయితే రెడ్ జోన్లు సహా అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు చేసేందుకు అనుమతించింది రాజస్థాన్ సర్కారు. భౌతిక దూరం నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామన్న హామీతోనే షాపులు తెరిచేందుకు అవకాశం ఇచ్చింది. దుకాణాల ముందు బారికెడ్లు ఏర్పాటు చేయాలని సూచించింది.
రాజస్థాన్‌లో కూపన్ల జారీకి ముందు పరిస్థితి ఇదీ చూడండి:భారత్‌లో 'విద్య' కోసం అమెరికా భారీ రుణసాయం