తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కష్టకాలాన్ని పాత పద్ధతితో నెట్టుకొస్తున్న కన్నడిగులు - భారతదేశంలో కరోనా వైరస్​

కరోనా మహమ్మారి విస్తృతితో ప్రపంచ దేశాలు భారీగా దెబ్బతిన్నాయి. వైరస్​ కట్టడికి భారత్​లోనూ 21 రోజుల లాక్​డౌన్​ ప్రకటించింది మోదీ సర్కార్​. ఈ కారణంగా నిత్యావసరాల కొరతతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. దీని పరిష్కారానికి పాతకాలం నాటి ఓ చక్కటి ఆలోచన చేశారు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల ప్రజలు.

Lock down effect; village people following Barter System for their needs
కష్టకాలాన్ని పాతపద్ధతితో నెట్టుకొస్తున్న కన్నడిగులు

By

Published : Apr 2, 2020, 5:25 PM IST

దేశంలో లాక్​డౌన్​ వల్ల నిత్యావసరాలు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందినవాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు. అయితే.. ఈ సమస్య పరిష్కారానికి కర్ణాటక మైసూర్​ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఓ మంచి ఆలోచన చేశారు.

వస్తువుల కొరతను అధిగమించేందుకు వస్తు మార్పిడి విధానం అవలంబిస్తున్నారు. పరస్పర అంగీకారంతో నిత్యావసరాలు పంచుకుంటూ సహకరించుకుంటున్నారు.

నీకు గోధుమలు.. నాకు బియ్యం...

ఉదాహరణకు ఒకరు బియ్యం ఇస్తే.. బదులుగా గోధుమలు, గోధుమలిస్తే బియ్యం ఇవ్వడం వంటివి చేస్తున్నారు. పండ్లు, కూరగాయలు, ఇతరత్ర సామగ్రి ఏదైనా ఇదే పద్ధతిని పాటిస్తూ కొరత లేకుండా చూసుకుంటున్నారు. మందకళ్లి, కెంచలగుడు, నాగనహళ్లి గ్రామాల్లో ఈ పద్ధతినే పాటిస్తున్నారు.

ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కన్నడిగులు

డబ్బు వాడుకలో లేక ముందు ఈ తరహా విధానం​ ఉంది. శతాబ్దాల క్రితం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఇలా ఇచ్చిపుచ్చుకోవడం సాధారణమే అయినప్పటికీ ప్రస్తుత కష్టకాలంలో ఒకరినొకరు సహకరించుకోవడం ప్రశంసనీయమని చెప్పుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details