తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆర్బిటర్ పనితీరు​పై అనుమానాలు పటాపంచలు' - ఆర్బిటార్​పై అనుమానాలు

విక్రమ్ ల్యాండర్​లో తలెత్తిన సాంకేతిక సమస్య నేపథ్యంలో.. ఆర్బిటర్​​ పనితీరుపై నెలకొన్న అనుమానాలు పటాపంచలయ్యాయని నిపుణులు తెలిపారు. ల్యాండర్​కు చెందిన థర్మల్​ చిత్రాలను పంపి.. తాను అద్భుతంగా పని చేస్తున్నట్లు ఆర్బిటర్​​ నిరూపించిందని అభిప్రాయపడ్డారు.

చంద్రయాన్​-2

By

Published : Sep 9, 2019, 5:21 AM IST

Updated : Sep 29, 2019, 10:57 PM IST

విక్రమ్​ ల్యాండర్​ ఆచూకీ లభించినట్లు ఇస్రో ఆదివారం ప్రకటించింది. ల్యాండర్​లో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఆర్బిటర్​ పనితీరుపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ల్యాండర్​ గురించి సమాచారం అందించి.. ఆర్బిటర్ తన పనితీరుపై ఉన్న​ అనుమానాలను తొలగించిందని అంతరిక్ష పరిశోధన నిపుణుడు అజయ్​ లేలే ఉద్ఘాటించారు. ఇక మిగిలింది ల్యాండర్​ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడమేనని అభిప్రాయపడ్డారు. 'ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ డిఫెన్స్ స్డడీస్​ అండ్​ అనాలసిస్​'​లో సీనియర్​ నిపుణుడిగా ఉన్నారు అజయ్​ లేలే.

"ల్యాండర్​ ఆచూకీతో ఆర్బిటర్​పై నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయి. చంద్రయాన్​-2లో ఆర్బిటర్​ ఒక ప్రధాన భాగం. ఇది ఏడాది కన్నా ఎక్కువ కాలం పని చేస్తుంది." -అజయ్​ లేలే, అంతరిక్ష పరిశోధన నిపుణుడు

ఆర్బిటర్ ఎలాంటి ఆటంకం లేకుండా పని చేస్తుందంటే.. చంద్రయాన్​-2 లక్ష్యం 90-95 శాతం పూర్తయినట్లేనని అజయ్​ అభిప్రాయపడ్డారు.

ఇస్రో మాజీ ఛైర్మన్​ స్పందన..

చంద్రయాన్​-2పై ఇస్రో మాజీ ఛైర్మన్​ ఎస్​. నంబి నారాయణన్​ స్పందించారు. ల్యాండర్​ ఆచూకీ తెలియడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతమున్న సవాలు విక్రమ్​తో సంకేతాలు పునరుద్ధరించడమేనని అన్నారు. అనుకున్నట్లుగా విక్రమ్ మృదువుగా దిగలేకపోతే.. సంకేతాల పునరుద్ధరణ అవకాశాలు తక్కువేనని అభిప్రాయాపడ్డారు.

ఇదీ చూడండి: దేశంలో క్రీడాస్ఫూర్తి తరహాలో ఇస్రో-స్ఫూర్తి: మోదీ

Last Updated : Sep 29, 2019, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details