తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండేళ్లకే అంకెలతో ఆడేసుకుంటున్న బుడతడు - ఎర్నాకుళం ఎథాన్​ అశ్విన్​

కేరళలో ఓ బాలుడు రెండేళ్లకే ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్నాడు. ఆడుతూపాడుతూ సరాదాగా గడిపే ప్రాయంలోనే ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్​ నెలకొల్పాడు. అంతేకాదండోయ్​.. ఆరు అంతర్జాతీయ పురస్కారాలూ కైవసం చేసుకున్నాడీ బుడ్డోడు. బొమ్మలతో కాకుండా అంకెలతో ఆడుకుంటూ అబ్బురపరుస్తున్నాడు.

Little Ethan plays with letters and numerals more than toys in Kerala
ఆటల కంటే అంకెలే మక్కువ- రెండేళ్లకే 6అంతర్జాతీయ అవార్డులు

By

Published : Oct 11, 2020, 5:08 AM IST

కేరళ ఎర్నాకుళంలో ఓ రెండేళ్ల బాలుడు అంకెలు, అక్షరాలతో ఆడుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కేవలం 6నిమిషాల 38సెకన్లలోనే ఆంగ్ల అక్షరాలను తిరగేసి(జడ్​ నుంచి ఏ వరకు) రాసి ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్​లో చోటు దక్కించుకున్నాడు ఎథాన్​ అశ్విన్. ఈ బాలుడి ప్రతిభ మెచ్చిన ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ సంస్థ.. అతడికి 'గ్రాండ్​ మాస్టర్​' అనే బిరుదునిచ్చింది.

ఆటల కంటే అంకెలే మక్కువ- రెండేళ్లకే 6అంతర్జాతీయ అవార్డులు

అంతర్జాతీయ అవార్జులు..

పసిప్రాయంలోనే గణిత అంశాలపై పట్టుసాధించిన అశ్విన్​.. రెండంకెల(1-99) సరి, బేసి సంఖ్యలను సులభంగా గుర్తిస్తున్నాడు. 1 నుంచి 10వరకు వర్గమూలాలనూ టకటకా చెప్పేస్తున్నాడు. 1 నుంచి 100 వరకు అంకెలను రివర్స్​ ఆర్డర్​లో చెప్పడం, రాయడం చేస్తున్న అశ్విన్​ ప్రతభకు.. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్​ గుర్తింపు దక్కింది. ఇలా ఇప్పటివరకు 6 అంతర్జాతీయ అవార్డులు అతడి సొంతమయ్యాయి.

ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్​ ధ్రువీకరణ పత్రం

చెస్​పై అమితాసక్తి..

చదువు సంబంధిత విషయాలే కాకుండా ఇతర అంశాలపైనా అశ్విన్​కు మంచి పట్టుంది. 15 రకాల జంతువుల శబ్దాలను ఇట్టే పసిగట్టేస్తూ ఔరా అనిపించుకుంటున్నాడు. అంతే కాదండోయ్.. 16 రకాల ఆకారాలు, 18 రంగులను అలవోకగా గుర్తిస్తూ తన ప్రతిభ చాటుకుంటున్నాడు.

చెస్​పై ఆసక్తితో..

డ్రాయింగ్​లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న అశ్విన్​.. బంకమట్టితో రకరకాల నమూనాలను తయారుచేసి అబ్బురపరుస్తున్నాడు. అంతేకాకుండా రెండేళ్ల ప్రాయంలోనే చెస్​పై అమితాసక్తి చూపించడం విశేషం.

లాలిపాడితే నిద్రపోడట.!

ఎథాన్​ లాలి పాటలు పాడితే నిద్రపోడట. వాటికి బదులుగా సంఖ్యలు, వర్ణమాల వంటివి చెబితే ఆసక్తిగా వింటాడని అతడి తల్లి చెప్పుకొచ్చారు. అశ్విన్​ ప్రతిభ, నైపుణ్యాలను పెంపొందించేందుకు అతడి తల్లిదండ్రులూ ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం వాళ్ల ఇంట్లో క్యాలెండర్​, గడియారం వంటివాటిని అశ్విన్​ కోరిక మేరకే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారట.

అమ్మానాన్నలతో ఎథాన్​ అశ్విన్​

ఇదీ చదవండి:రుద్రప్రయాగ్​లో విరబూసిన బ్రహ్మకమలాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details