తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైలు నుంచి విముక్తి- శశికళ విడుదల నేడే - శశికళ జైలు విముక్తి

జయలలిత నెచ్చెలి వీకే శశికళను ఇవాళ విడుదల చేయనున్నారు అధికారులు. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న శశికళ.. విడుదల తర్వాత కూడా ఆస్పత్రిలోనే కొనసాగనున్నారు.

leader-v-k-sasikala-will-be-a-free-person-on-wednesday-after-completing-her-four-year-jail-term-in-a-corruption-case
జైలు నుంచి విముక్తి- శశికళ నేడే విడుదల

By

Published : Jan 27, 2021, 5:25 AM IST

Updated : Jan 27, 2021, 6:41 AM IST

అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత స్నేహితురాలు వీకే శశికళ జైలు జీవితం ముగియనుంది. అవినీతికి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన ఆమెను ఇవాళ విడుదల చేయనున్నారు అధికారులు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఆస్పత్రిలోనే పూర్తి చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

కరోనా బారిన పడ్డ శశికళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విడుదలైన తర్వాత కూడా ఆమె ఆస్పత్రిలోనే ఉండనున్నారు.

జనవరి 20న శశికళకు కరోనా సోకింది. ప్రస్తుతం విక్టోరియా ఆస్పత్రిలో ఉన్నారు. ఆమెను ఎప్పుడు డిశ్ఛార్జి చేస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఆస్పత్రి వర్గాలతో చర్చించి డిశ్ఛార్జిపై నిర్ణయం తీసుకుంటామని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్​ తెలిపారు.

ఆస్పత్రిలోనే..

ప్రస్తుతం శశికళ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కరోనా లక్షణాలు ఏవీ లేవని వెల్లడించారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం ఇంకో పది రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తే.. అందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.

Last Updated : Jan 27, 2021, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details