తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంచంపై పడుకుని లాయర్​ వాదనలు- సుప్రీం ఫైర్ - supreme latest updates

ఓ కేసు విచారణలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్​లో మంచంపై పడుకుని, టీషర్టు ధరించి సుప్రీం ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు ఓ న్యాయవాది. అతని తీరుపై న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. కనీస మర్యాదలు పాటించాలని సూచించారు.

Lawyer appears in virtual hearing while lying on bed; SC says minimum court etiquette be followed
కోర్టు మర్యాదలు పాటించని లాయర్

By

Published : Jun 20, 2020, 4:00 PM IST

కరోనా మమమ్మారి నేపథ్యంలో కోర్టులో నేరుగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా కేసుల వాదనలు వింటోంది సర్వోన్నత న్యాయస్థానం. అయితే... ఓ కేసు విచారణ సందర్భంగా మంచంపై పడుకుని, టీషర్టు ధరించి ధర్మాసనం ఎదుట హాజరయ్యారు ఓ న్యాయవాది. ఆయన తీరుపై న్యాయమూర్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీస మర్యాదలు పాటించాలని చురకలంటించారు.

తన తప్పును తెలుసుకుని కోర్టును క్షమాపణలు కోరారు న్యాయవాది. జస్టిస్​ ఎస్​ రవీంద్ర భట్​ సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని సూచించారు.

హరియాణా రేవారీలో ఫ్యామిలీ కోర్టులో పెండింగ్​లో ఉన్న ఓ కేసును బిహార్​ జెహనాబాద్​ కోర్టుకు బదిలీ చేయాలనే విషయంపై వాదనలు జరుగుతున్నప్పుడు ఇలా జరిగింది.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట వాదనలు వినిపించే సమయంలో న్యాయవాదులంతా తప్పనిసరిగా కనీస మర్యాదలు పాటించాలని, వీడియో బ్యాక్​గ్రౌండ్​లో అసంబద్ధ చిత్రాలు ఉండకుండా చూసుకోవాలని, సరైన దుస్తులు ధరించాలని జూన్​ 15న ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.

ఏప్రిల్​లోనూ..

ఏప్రిల్​లో ఓ బెయిల్​కు సంబంధించిన కేసును వీడియో కాన్పరెన్స్​ ద్వారా విచారిస్తున్నప్పుడు బనియన్​ ధరించి రాజస్థాన్​ హైకోర్టు ధర్మాసనం ఎదుట హాజరయ్యారు ఓ న్యాయవాది. కనీస మర్యాదలు పాటించలేదని న్యాయస్థానం అతడ్ని మందలించింది.

ఇదీ చూడండి: భారత గగనతలంలోకి పాక్​ డ్రోన్​.. కూల్చిన భద్రతా దళాలు

ABOUT THE AUTHOR

...view details