బిహార్ లఖీసరాయ్ జిల్లా సూర్యగఢలో ఘోర ప్రమాదం జరిగింది. ఛాన్నియా ఘాట్ వద్ద నదిలో ఓ పడవ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో పడవలో 40-50 మధ్య ఉన్నారని తెలుస్తోంది. ఇందులో ఐదుగురి ఆచూకీ గల్లంతయింది. వారికోసం గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలిస్తున్నారు. మిగతావారిని నది ఒడ్డుకు చేర్చారు. వీరిలో కొందరు అపస్మారక స్థితిలో ఉన్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నదిలో పడవ బోల్తా.. ఐదుగురు గల్లంతు - బిహార్
బిహార్లో ఘోర ప్రమాదం జరిగింది. లఖీసరాయ్ జిల్లా సూర్యగఢ ఛాన్నియా ఘాట్ వద్ద ఓ పడవ బోల్తా పడింది. ఐదుగురు గల్లంతయ్యారు. ఘటన సమయంలో 40 నుంచి 50 మంది పడవలో ఉన్నట్లు తెలుస్తోంది.
బిహార్ నదిలో పడవ బోల్తా.. ఐదుగురు గల్లంతు