భారతీయ తపాలా శాఖ, పోస్ట్మెన్ల సేవలను ప్రశంసించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విపత్కర పరిస్థితుల్లో .. నిత్యావసరాలు, ఔషధాలు, నగదును ప్రజలకు చేరవేస్తూ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ట్వీట్‌ను జోడిస్తూ.. రీట్వీట్ చేశారు మోదీ.
"భారతీయ తపాలా శాఖ నెట్వర్క్, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేసేందుకు కష్టపడి పని చేస్తున్న పోస్ట్మెన్లకు కృతజ్ఞతలు."