తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిరసనల సెగతో మెట్రో ఎక్కిన మంత్రి

కర్ణాటకలో నీళ్లు, రిజర్వేషన్ల కోసం ఆందోళనలు ఊపందుకున్నాయి. మండ్యలో సాగునీరు కేటాయించాలని రైతులు రోడ్డెక్కగా.. వాల్మీకి సమాజానికి రిజర్వేషన్లు కల్పించాలని ఆందోళనకారులు విధాన సౌధ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ రెండు నిరసన సెగలతో రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్​ ఇబ్బందులు పడ్డారు.

కర్ణాటకలో నిరసనలు

By

Published : Jun 25, 2019, 12:56 PM IST

Updated : Jun 25, 2019, 3:10 PM IST

మండ్యలో రైతులు, బెంగళూరులో వాల్మీకీ కోటా

సాగు నీరు కేటాయించాలని కర్ణాటక మండ్య రైతులు చేపట్టిన ఆందోళన 5వ రోజుకు చేరుకుంది. కావేరీ, హేమావతి నదుల జలాలను కాల్వల ద్వారా పంటపొలాలకు తరలించాలని రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలో మంగళవారం బెంగళూరు వెళుతున్న మంత్రి డీకే శివకుమార్​ వాహనాన్ని అడ్డుకున్న రైతులు తమ డిమాండ్లను విన్నవించారు.

"ఈ విషయంలో నేనేమీ చేయలేదు. ఆ శాఖ నా చేతిలో లేదు. నీటి నిర్వహణ యాజమాన్యంతో నేను మాట్లాడుతా"నని మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వాల్మీకి కోటా కోసం...

తమ సమాజానికి 7.5 శాతం రిజర్వేషన్​ కల్పించాలని విధాన సౌధ ఎదుట ధర్నాకు దిగారు వాల్మీకి వర్గం మద్దతుదారులు. జనాభా ఆధారంగా కోటా కల్పించాలని వాల్మీకి సమాజం ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనల నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్​ స్తంభించింది. ఈ ట్రాఫిక్​లో మంత్రి డీకే శివకుమార్​ చిక్కుకుపోయారు.

మెట్రోలో మంత్రి

అక్రమ ఆస్తుల కేసులో ప్రత్యేక కోర్టుకు హాజరుకావాల్సిన మంత్రి శివకుమార్...విధాన సౌధ వద్ద ట్రాఫిక్​ కారణంగా మెట్రోలో ప్రయాణించారు.

ఇదీ చూడండి: 'నీటి బిల్లును మా సీఎం ఎప్పుడో చెల్లించారు'

Last Updated : Jun 25, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details