తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జెండా స్తంభానికి విద్యుత్- ఐదుగురు విద్యార్థులు మృతి - కొప్పాల

కర్ణాటక కొప్పాలలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బాలుర వసతి గృహంలో విద్యుదాఘాతంతో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు.

ఐదుగురు విద్యార్థులు మృతి

By

Published : Aug 18, 2019, 9:34 AM IST

Updated : Sep 27, 2019, 9:09 AM IST

జెండా స్తంభానికి విద్యుత్

కర్ణాటక కొప్పాలలోని ఓ వసతిగృహంలో ఘోర ప్రమాదం జరిగింది. జెండాస్తంభానికి విద్యుత్​ సరఫరా కావడం వల్ల ఐదుగురు విద్యార్థులు మరణించారు.

కొప్పాలలోని డి.దేవరాజు బాలుర వసతి గృహంలో గురువారం స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. 8, 9, 10 తరగతులు చదివే ఐదుగురు విద్యార్థులు ఈ ఉదయం జెండా స్తంభాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. పైన ఉన్న తీగలకు తగలడం వల్ల స్తంభానికి విద్యుత్​ సరఫరా అయింది. క్షణాల్లోనే ఐదుగురు కరెంట్​ షాక్​తో అక్కడికక్కడే మరణించారు.

బాలుర మరణవార్త తెలుసుకుని వారి కుటుంబసభ్యులు తీవ్ర విషాదం మునిగిపోయారు.

ఇదీ చూడండి: దయనీయం: నిరుద్యోగి 'డాక్టర్' ఆకలి వ్యథ!

Last Updated : Sep 27, 2019, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details