బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా పురాతన విగ్రహాలను పట్టుకున్నారు కోల్‌కతా కస్టమ్స్ అధికారులు. ఇందులో 25 విగ్రహాలు ఉన్నాయని, వీటి విలువ రూ.35.3 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో విగ్రహాలను స్వాధీనం చేసుకోవటం ఇదే తొలిసారని వెల్లడించారు.
రూ.35కోట్ల విలువైన పురాతన విగ్రహాల పట్టివేత - ANTIQUE IDOLS
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో రూ.35 కోట్ల విలువ ఉన్న పురాతన విగ్రహాలను తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 25 విగ్రహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో విగ్రహాలను పట్టుకోవటం ఇదే తొలిసారని తెలిపారు.
పట్టుబడ్డ విగ్రహాలు
దక్షిణ దినాజ్‌పుర్ జిల్లాలోని కాళియాగంజ్ సరిహద్దులో చెత్త లారీలో వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇందులో పార్వతీ, మానసా దేవీ, విష్ణు, సూర్యుడి విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు ఏడు లోహ, 11 టెర్రకోట విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు 9వ, 16వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు.