తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​కు ప్రశాంత్​ కిషోర్​ 'కృతజ్ఞతలు'

పౌరసత్వ చట్టానికి, జాతీయ పౌర జాబితాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళనల్లో పాల్గొంనందుకు రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు జేడియూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్​ కిశోర్​. . కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వీటిని అమలు చేయబోమని కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించాలని రాహుల్​ని అభ్యర్థించారు.

kishore
రాహుల్​గాంధీకి ప్రశాంత్​ కిషోర్​ 'కృతజ్ఞతలు'

By

Published : Dec 24, 2019, 10:26 PM IST

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సంఘీభావంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టినందుకు రాహుల్‌ గాంధీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ప్రశాంత్‌ కృతజ్ఞతలు తెలిపారు.

'సీఏఏ', 'ఎన్​ఆర్​సి'కి సంబంధించి ఓ కీలక సూచన చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వీటిని అమలు చేయబోమని కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించాలని రాహుల్​ని కోరారు.

పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుకు జేడీయూ అనుకూలంగా ఓటు వేసింది. కానీ, తొలి నుంచి సీఏఏ, ఎన్​ఆర్​సిని వ్యతిరేకిస్తున్న ప్రశాంత్‌కిశోర్‌ పార్టీ వైఖరిని తప్పుబట్టారు. దీనిపై భాజపాయేతర పక్షాలన్నీ ఏకమై నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రాహుల్​ స్పందన

ప్రశాంత్​ కిశోర్​ సూచన మేరకు కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడేలా రాహుల్‌ గాంధీ చూస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఇదీ చూడండి : 1.10 కోట్లు దాటిన ఫాస్టాగ్​ విక్రయాలు: ఎన్​హెచ్ఏఐ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details