తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచవ్యాప్తంగా 'యోగా సంరంభం'

అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో 40 వేల మంది ఔత్సాహికులతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన మిగతా వేదికల్లో కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

అట్టహాసంగా ప్రారంభమైన యోగా పండగ

By

Published : Jun 21, 2019, 7:04 AM IST

Updated : Jun 21, 2019, 9:20 AM IST

అట్టహాసంగా ప్రారంభమైన యోగా పండగ

అయిదో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అట్టహాసంగా వేడుకలు జరిగాయి. ఝార్ఖండ్​ రాజధాని రాంచీలో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు.

40వేల మందితో మోదీ యోగాసనాలు

రాంచీలోని ప్రభాత్​ తార మైదానంలో ప్రధానితో పాటు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ సహా 40 వేల మంది ఔత్సాహికులతో యోగా డే వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా 400 శౌచాలయాలు, 200 తాగునీటి ట్యాంకర్లు, 8 వైద్య​ బృందాలు, 21 అంబులెన్స్​లు అందుబాటులో ఉంచారు. భద్రత దృష్ట్యా 100 సీసీటీవీలతో సహా 4 వేల మంది రాష్ట్ర, పారామిలిటరీ బలగాలు ప్రభాత్‌ తార మైదానంలో పహారా కాస్తున్నారు.

రోహ్​తక్​లో అమిత్​ షా

రోహ్​తక్​లో జరిగే వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పాల్గొన్నారు. దిల్లీలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా భాగమయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలో జరిగే వేడుకలకు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా హాజరయ్యారు.

రాజధానిలో యోగా సంరంభం

దేశ రాజధాని దిల్లీలో భారీ స్థాయిలో యోగా డే నిర్వహిస్తోంది ప్రభుత్వం. దిల్లీ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 300 కార్యక్రమాల్లో 10 లక్షల మంది ప్రజలు హాజరయ్యారని అంచనా. ఈ వేదికల్లో మిగిలిన కేంద్రమంత్రులు పాల్గొన్నారు. భాజపా ఎంపీ గౌతం గంభీర్​, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ వేర్వేరు కార్యాక్రమాల్లో పాలుపంచుకున్నారు.

యోగా కేంద్రాలకు ప్రజలు త్వరగా చేరుకునేందుకు ఉదయం 4 గంటల నుంచే మెట్రో సేవలను నడుపుతున్నారు.

ఐరాసలో సూర్య నమస్కారం

జూన్‌ 21న యోగా వేడుకలు జరనున్న నేపథ్యంలో అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం 'సూర్య నమస్కారం' పోస్టర్లతో కళకళలాడుతోంది. యోగా ఆవశ్యకతను తెలిపే పలురకాల ప్రదర్శనలు సైతం ఐరాస కార్యాలయంలో చేపడుతారు.

'యోగా ఫర్​ ది హార్ట్​'

ఏటా జూన్‌ 21 ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని 2014 డిసెంబర్ 11న ఐరాస ప్రకటించింది. 2015 నుంచి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుగుతోంది. 'యోగా ఫర్​ ది హార్ట్​' అన్న నినాదంతో ఈ ఏడాది వేడుకలు జరుగుతున్నాయి.

దౌత్యవేత్తలకు మోదీ సందేశం

ప్రపంచ వ్యాప్తంగా యోగా డే వేడుకలను నిర్వహించేలా విదేశాల్లోని భారత దౌత్యవేత్తలకు మోదీ వీడియో సందేశం పంపారు. ప్రపంచ దేశాల రాజధాని నగరాలతో పాటు అన్ని ప్రాంతాలకు వేడుకలను విస్తరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నాందేడ్​లో రాందేవ్​ బాబా

మహారాష్ట్ర నాందేడ్​లో యోగా గురు రాందేవ్​ బాబా ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం చేపట్టారు. ఈ వేడుకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ హాజరయ్యారు.

Last Updated : Jun 21, 2019, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details