తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై యుద్ధానికి కృత్రిమ మేథస్సు కలిగిన డ్రోన్​లు​

కరోనా నియంత్రణలో భాగంగా ఆయా రాష్ట్రాలు సాంకేతికతను వినియోగించుకుంటున్నాయి. ఇందులో భాగంగా కేరళలోని మేకర్​ విలేజ్​కు చెందిన ఓ స్టార్టప్​ సంస్థ ప్రత్యేకమైన డ్రోన్​ను రూపొందిస్తోంది. కృత్రిమ మేథస్సుతో పనిచేసే ఈ డ్రోన్​లు శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించం, నిత్యవసర వస్తువుల సరఫరా చేపట్టనున్నాయి. అంతేకాకుండా పోలీసులకు గస్తీలోనూ సహకరించనున్నాయి.

Kerala Based Startup Has Developed a Drone Supported With Artificial Intelligence (AI) that can help combat COVID-19
కృత్రిమ మేథ

By

Published : Apr 18, 2020, 7:01 AM IST

కరోనా కట్టడిలో భాగంగా కేరళలోని కొచ్చిలో మేకర్​ విలేజ్​కు చెందిన ఓ అంకుర సంస్థ(స్టార్టప్​ కంపెనీ) కృత్రిమ మేథ కలిగిన డ్రోన్​లను అందుబాటులోకి తీసుకురానుంది. ఇవి ప్రజల శరీర ఉష్ణోగ్రతలు పరిశీలించనున్నాయి. అంతేకాకుండా నిత్యవరస వస్తువులను సరఫరా చేయడం, క్రిముల నిర్మూలనకు రసాయనాలు చల్లడం వంటి వాటికి ఉపయోగపడనున్నాయి.

ఇప్పటికే ఈ తరహా డ్రోన్​ను మేకర్​ విలేజ్​కు చెందిన ఏరియల్​ డైనమిక్స్ సంస్థ రూపొందించింది. అయితే దానికి ఎటువంటి పేరు పెట్టలేదు. దేశంలోనే అతిపెద్ద ఎల్ట్రానిక్​ హార్డ్​వేర్​ ఇంక్యుబేటర్​, ఈఎస్​డీఎం సదుపాయం కలిగిన సంస్థ విలేజ్​ మేకర్​. ప్రపంచస్థాయి ల్యాబ్​లు, పరికరాలతో పాటు ​ఇతర సాఫ్ట్​వేర్​ సాంకేతికత సదుపాయాలను ఈ సంస్థ కల్పిస్తుంది.

ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాటితో పోలిస్తే.. స్వదేశంలో తయారు చేసిన ఈ డ్రోన్​ ఎంతో సమర్థవంతంగా పని చేస్తుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా లాక్​డౌన్​ విధించిన ప్రాంతాలను, రోడ్లపై ట్రాఫిక్​ పర్యవేక్షించేందుకు ఈ డ్రోన్​ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. లాక్​డౌన్​ను మరింత కఠినతరం చేసే క్రమంలో కేరళ పోలీసులు ఇప్పటికే డ్రోన్లు వినియోగిస్తున్నారు.

ఇంకా మరెన్నో సదుపాయాలు...

  • వైరస్​ పరీక్ష నమూనాలనూ తీసుకురాగలదు.
  • సుమారు 60 కిలోల బరువున్న నిత్యవసర సరుకులను సరఫరా చేయగలదు.
  • అధునాతన టెక్నాలజీతో కూడిన స్ప్రేతో రసాయనాలను చల్లగలదు.
  • ప్రజలకు సమాచారం తెలియజేసేందుకు లౌడ్​స్పీకర్​ సదుపాయం.
  • హై రెజల్యూషన్​ కెమెరాతో చుట్టు పక్కల ప్రాంతాల పరిశీలించడం.
  • ఐఆర్​ సెన్సార్​ సాయంతో థర్మల్​ డేటాను సేకరించగలదు.

ABOUT THE AUTHOR

...view details