తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీబీఎస్​ఈ ఫలితం: స్మృతి గర్వం- కేజ్రీ ఆనందం

సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాల్లో సత్తా చాటారు పలువురు ప్రముఖుల పిల్లలు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమారుడు జోహ్ర్ ఇరానీ, దిల్లీ సీఎం కేజ్రీవాల్ తనయుడు పుల్కిత్ కేజ్రీవాల్ 90శాతంపైగా మార్కులు సాధించారు.

స్మృతి గర్వం- కేజ్రీ ఆనందం

By

Published : May 2, 2019, 7:08 PM IST

కుమారుడు ప్రతిభ కనబరిస్తే ఏ తల్లిదండ్రులకైనా పుత్రోత్సాహమే. సాధారణ గృహిణి నుంచి అసాధారణ మహిళల వరకు.. ఎవరైనా కుమారుని ప్రతిభ నలుగురికీ చెప్పుకుని మురిసిపోవాల్సిందే. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విషయంలో ఇదే జరిగింది. దిల్లీ సీఎం కేజ్రీవాల్ తనయుడూ అంతే.

సీబీఎస్​ఈ క్లాస్ 12 ఫలితాల్లో ఎకనమిక్స్​లో 94 శాతం మార్కులు సాధించాడు స్మృతి కుమారుడు జోహ్ర్. నాలుగు సబ్జెక్టుల్లో 91శాతం మార్కులు పొందాడు. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ... ఇవాళ నేనెంతో గర్వపడుతున్నా అన్నారు స్మృతి ఇరానీ.


దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తనయుడు పుల్కిత్ కేజ్రీవాల్ సీబీఎస్​ఈలో విశేష ప్రతిభ కనబరిచాడు. 96.4 శాతం మార్కులు సాధించాడు పుల్కిత్. ఈ విషయాన్ని తన తల్లి సునీత కేజ్రీవాల్ ట్విట్టర్​ ద్వారా పంచుకున్నారు.

సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాల్లో ఈ ఏడాదీ బాలికలదే పైచేయి. ఘజియాబాద్​ వాసి హన్సిక శుక్లా, ముజఫర్ నగర్​కు చెందిన కరిష్మా అరోరా ఇద్దరూ 500కు 499 మార్కులతో ఉమ్మడిగా టాపర్స్​గా నిలిచారు.

ముగ్గురు విద్యార్థులు... గౌరాంగి చావ్లా(ఉత్తరాఖండ్​-రిషికేష్), ఐశ్వర్య(యూపీ-రాయ్​బరేలీ), భవ్య(హరియాణా- జింద్) 498 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావ్​డేకర్​ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details