తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విదేశీ నిధులతో వేర్పాటువాదుల జల్సాలు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వేర్పాటువాద నేతలు చేసిన కుట్రలపై కీలక విషయాలు వెల్లడించింది ఎన్​ఐఏ. విదేశాల నుంచి నిధులు స్వీకరించి వాటిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించారని తేల్చింది.

By

Published : Jun 16, 2019, 6:29 PM IST

విదేశీ నిధులతో వేర్పాటు వాదుల జల్సాలు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వేర్పాటువాద నేతలు విదేశాల నుంచి నిధులు స్వీకరించి వాటిని వ్యక్తిగత ప్రయోజనాలు, బంధువుల చదువుల కోసం వినియోగించారని జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో వెల్లడైంది.

హురియత్‌ కాన్ఫరెన్స్‌ సహా పలు వేర్పాటువాద సంస్థల నేతలను విచారించింది ఎన్​ఐఏ. జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాద సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్‌ నుంచి వారు నిధులు స్వీకరించారని స్పష్టం చేసింది.

వేర్పాటువాద సంస్థ దుఖ్తారన్‌ -ఎ- మిలాత్‌ నేత అసియా ఆంద్రాబి తన కుమారుడిని మలేషియాలో చదివించేందుకు నిధులను వినియోగించినట్లు ఎన్​ఐఏ వెల్లడించింది. ఈ కేసులో ఆమెను ఇప్పటికే అరెస్ట్‌ చేసి విచారించింది. విదేశాల నుంచి నిధులు సేకరించినట్లు అసియా ఆంద్రాబీ అంగీకరించారని తెలిపింది ఎన్ఐఏ. ఆ డబ్బుతో ముస్లిం మహిళలతో జమ్ముకశ్మీర్‌లో నిరసనలు నిర్వహించినట్లు ఒప్పుకున్నారని వెల్లడించింది. ఆసియా ఆంద్రాబీ, ఆమె కుమారుడు మహ్మద్ బిన్ ఖాసిమ్ ఉపయోగించిన బ్యాంకు ఖాతాల సమాచారం కోసం అధికారులను సంప్రదించింది ఎన్​ఐఏ.

భారత్‌లో విధ్వంసానికి భారీ కుట్ర చేసిన ఆరోపణలపై 13 మంది వేర్పాటువాద నేతలపై 2017లో కేసు నమోదు చేసి, అభియోగ పత్రం దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ.

ఇదీ చూడండి: 'చర్చకు సై.. కానీ షరతులు వర్తిస్తాయ్​'

ABOUT THE AUTHOR

...view details