తెలంగాణ

telangana

ETV Bharat / bharat

370రద్దుతో ఒక్కటైన 'కశ్మీరీ-రాజస్థానీ' ప్రేమజంట - jammu

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత తొలిసారి ఓ కశ్మీరీ అమ్మాయికి ఇతర రాష్ట్రానికి చెందిన యువకుడితో వివాహమైంది. కశ్మీర్​కు చెందిన యువతి రాజస్థాన్​ ఇంటి కోడలైంది. వీరిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మోదీ సర్కారు సంచలన నిర్ణయంతో ప్రేమను పెళ్లిగా మలచి ఒక్కటయ్యారు.

370రద్దుతో ఒక్కటైన 'కశ్మీరీ-రాజస్థానీ' ప్రేమజంట

By

Published : Aug 29, 2019, 5:12 AM IST

Updated : Sep 28, 2019, 4:46 PM IST

370రద్దుతో ఒక్కటైన 'కశ్మీరీ-రాజస్థానీ' ప్రేమజంట

కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దుతో ఆ రాష్ట్రానికి చెందిన యువతులు ఇతర రాష్ట్రాల యువకులను వివాహమాడేందుకు మార్గం సుగమం అయ్యింది. ఓ కశ్మీరీ యువతి.. రాజస్థాన్​కు చెందిన వ్యక్తిని పరిణయమాడింది. మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం తర్వాత ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఓ కశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి.

రాజస్థాన్​లోని శ్రీగంగానగర్​కు చెందిన అక్షయ్​ కొంతకాలం ముందు దిల్లీలో ఉద్యోగం చేశాడు. అదే సమయంలో కశ్మీర్​ యువతి కామిని రాజ్​పుత్​.. దిల్లీలోని తన అత్త నివాసంలో కొన్ని రోజులు గడిపింది. ఈ నేపథ్యంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అక్షయ్​- కామిని పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ అప్పటికి కశ్మీర్​కు ఉన్న పత్యేక ప్రతిపత్తి కారణంగా ఆ రాష్ట్ర యువతులు వేరే రాష్ట్రానికి చెందిన యవకులను పెళ్లి చేసుకోవడం కష్టంగా ఉండేది. యువత వారికున్న ప్రత్యేక హక్కులను కోల్పోయేవారు.

ఆర్టికల్​ 370 రద్దుతో అడ్డు తొలగిపోయింది. సామాజిక వర్గాలు వేరైనా... ఇద్దరు తమ కుటుంబాలను పెళ్లికి ఒప్పించారు.

"మా వివాహం బాగా జరిగింది. అందరం సంతోషంగా ఉన్నాం. కశ్మీర్​లో అందరికీ సమాన హక్కులు ఉండేలా మార్పు వచ్చింది. మా కుటుంబ నేపథ్యాలు వేరు. దిల్లీలో మా ప్రేమ మొదలైంది."

-అక్షయ్​ కుక్కడ్​, రాజస్థాన్.

అంతర్రాష్ట్ర ప్రత్యేక చట్టం కింద విహవాం

అక్షయ్​ ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి శ్రీగంగానగర్​లో వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. అంతర్ రాష్ట్ర ప్రత్యేక చట్టం కింద కామిని- అక్షయ్​ విహహం జరిగింది. ఈ పెళ్లికి జిల్లా కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. తమ కల నెరవేరినందుకు అక్షయ్​-కామినిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీరి వివాహ విందు వేడుకను అక్టోబరులో ఘనంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. జమ్ముకశ్మీర్ నుంచి వచ్చే బంధువుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

ఇదీ చూడండి: కాకి పగబట్టిందా? అందుకే దాడి చేస్తోందా?

Last Updated : Sep 28, 2019, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details