భారత్, పాకిస్థాన్ మధ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కర్తార్పూర్ నడవా విషయంలో తాజాగా ఓ అడ్డంకి ఏర్పడింది. రావి నదిపై వంతెన నిర్మించాలా లేదా రోడ్డు వేయాలా అనే అంశంలో ఇరుదేశాల నిపుణుల మధ్య తలెత్తిన బేధాభిప్రాయాలే ఇందుకు కారణం.
కర్తార్పూర్ జీరో పాయింట్ వద్ద నడవా నిర్మాణ విధివిధానాలు చర్చించడానికి సోమవారం పాకిస్థాన్, భారత్ నిపుణులు సమావేశమయ్యారు. ఓ గంటపాటు జరిగిన ఈ భేటీలో కారిడార్ నిర్మాణ పనుల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నారు.
వంతెనా? రోడ్డా?
రావి నదిపై తరచూ ఉద్ధృతంగా వరదలు వస్తుంటాయి కనుక ఓ కిలోమీటర్ పొడవైన వంతెన నిర్మించాలని భారత నిపుణులు ప్రతిపాదించారు. అయితే రహదారి నిర్మిస్తే సరిపోతుందని పాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. రహదారి వంపు అధికంగా ఉంచడం వల్ల వరద మప్పును సమర్థంగా ఎదుర్కొనవచ్చని తెలిపారు. ఈ విషయంలో ఇరు దేశాల ప్రతినిధులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. తదుపరి సమావేశం తేదీపైనా దాయాది దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.
ఇదీ విషయం..