తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంకోర్టుకు చేరిన కర్ణాటక రణం - స్పీకర్

సభాపతి ఉద్దేశపూర్వకంగానే తమ రాజీనామాలను ఆలస్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటకకు చెందిన 10మంది అసమ్మతి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టే అవకాశాలను గురువారం పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

సుప్రీంకోర్టుకు చేరిన కర్ణాటక అంశం

By

Published : Jul 10, 2019, 11:33 AM IST

కర్ణాటక అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. తమ రాజీనామాల ఆమోదంపై స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ వ్యాజ్యం దాఖలు చేశారు అసమ్మతి ఎమ్మెల్యేలు. 9 మంది రాజీనామాలు సరిగా లేవని, వ్యక్తిగతంగా కలవాలని స్పీకర్ రమేశ్​కుమార్ ప్రకటించిన నేపథ్యంలో ఈమేరకు న్యాయపోరాటం దిగారు రెబల్స్. స్పీకర్ ప్రజాస్వామ్య బాధ్యతల్ని విస్మరిస్తున్నారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అసమ్మతి ఎమ్మెల్యేల తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి హాజరయ్యారు.

ఈ వ్యవహారంపై విచారణ చేపట్టే అవకాశాలను గురువారం పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది.

ఇదీ చూడండి: 'ఆ రాజీనామాలను ఎందుకు ఆమోదించలేదు?'

ABOUT THE AUTHOR

...view details