తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​ వీడియో: టిప్పర్​- బైక్​ ఢీ... ఇద్దరు మృతి - కర్ణాటక

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కలబురిగిలో కూడలి వద్ద ఓ టిప్పర్... బైక్​ను ఢీకొని ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంలో విలవిల్లాడుతూ మరణించిన దృశ్యాలు సీసీ టీవీల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.

ఘోరం: ఇలాంటి విడియో మళ్లీ రికార్డు కావొద్దు!

By

Published : Jul 15, 2019, 1:04 PM IST

Updated : Jul 15, 2019, 3:19 PM IST

కర్ణాటక కలబురిగిలోని రాంమందిర్​ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్త బైక్​పై ఇంటికి వెళ్తున్న ఇద్దరిని టిప్పర్​ ఢీకొని అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. టిప్పర్ పూర్తిగా శరీరాలపై నుంచి వెళ్లింది. దేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. నిర్లక్ష్యంతో ఇద్దరిని బలిగొన్న టిప్పర్​ డ్రైవర్​ పరారయ్యాడు. మృతులను విజయపుర జిల్లాకు చెందిన లింగప్ప(31), శివాలాల్(41)​గా గుర్తించారు.

చివరి క్షణంలో ప్రాణాలతో పోరాడుతూ కన్ను మూసిన దృశ్యాలు సీసీ టీవిల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.

ఇదీ చూడండి:ఔరా: మట్టి లేకుండానే అధిక దిగుబడి.. పంట సాగు!

Last Updated : Jul 15, 2019, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details