తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంచి నీటి బావిలో పెట్రోల్ ఊరడం చూశారా? - కర్ణాటక కర్వార్​లో మంచి నీటి బావి నుంచి పెట్రోల్​

కర్ణాటక కర్వార్​ నగరంలో ఓ ఇంటిలోని మంచినీటి బావి నుంచి పెట్రోల్​ వస్తోంది. ఇది చూసి ఆ కుటుంబసభ్యులకు ఆశ్చర్యంతో పాటూ భయమేసింది. అయితే గతవారం రోజులుగా ఆ ఇంటి సమీపంలోకి పెట్రోల్​ బంకు నుంచి పెట్రోల్ లీక్​ అవుతుండడమే కారణమని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

karnataka: Full of petrol in a drinking water well
మంచి నీటి బావిలో పెట్రోల్ ఊరడం చూశారా?

By

Published : Dec 15, 2019, 5:38 PM IST

మంచి నీటి బావిలో పెట్రోల్ ఊరడం చూశారా?

మంచి నీటి బావి నుంచి పెట్రోల్​ వస్తున్న ఘటన కర్ణాటక కర్వార్​ నగరంలో జరిగింది. నాగవేణి ఆచారి అనే మహిళ తన ఇంటిలోని బావిలో రోజులానే నీళ్లు తోడుకున్నారు. అయితే ఆ నీళ్లు చూసి ఆమె కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.

నీళ్ల వాసన, రంగు.. పెట్రోల్​లానే ఉండటం చూసి ల్యాబ్​ టెస్ట్​కు పంపించారు. పరీక్షలో పెట్రోల్​, నీళ్లతో కలవడం వల్లనే ఇలా జరిగిందని తేలింది. ఓ వారం తరువాత బావి నుంచి విపరీతంగా పెట్రోల్ వాసన రావడం మొదలైంది. నీళ్లు కూడా పూర్తిగా ఎరుపురంగులోకి మారడం మొదలైంది. ఇది చూసి ఆమె కుటుంబ సభ్యులు కాస్త గాబరా పడ్డారు.

పెట్రోల్​ బంకు లీక్​ వల్లే

నాగవేణి ఇంటి సమీపంలో ఉన్న పెట్రోల్​ బంకు నుంచి గత వారం రోజులుగా పెట్రోల్​ లీక్​ అవుతోంది. ఆ కారణంగానే బావిలోకి పెట్రోల్​ చేరిందని గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి:స్థానిక కోటాతో కొత్త చిక్కులు-సమగ్రాభివృద్ధికి విఘాతం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details