తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకలో 'జంబలకడిపంబ'..! - వింత

కర్ణాటకలో ఓ పెళ్లి జరిగింది ...ఊరంతా దాని గురించే మాట్లాడుకున్నారు​...అంత వైభవంగా జరిగిందా..? అనుకోకండి...ఎంతో వింతగా జరిగింది....అచ్చం 'జంబలకడిపంబ' సినిమాలోని పెళ్లిలా.

పెళ్లి

By

Published : Mar 12, 2019, 4:30 PM IST

వివాహం అంటే సాధారణంగా వరుడు, వధువుకి తాళి కడతాడు. ఇది మన భారతీయ సంప్రదాయం.కానీ ఇక్కడ వధువులు వరుడి మెడలో మంగళ సూత్రం కట్టారు.

వరుడి మెడలో తాళి కడుతున్న యువతి

కర్ణాటక నలత్​వాద టౌన్​కు చెందిన అంకితా, ప్రియలకు, ప్రభు రాజు, అమిత్​లకు ఇచ్చి వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు.అయితే మగవారు తాళి కట్టే సంప్రదాయన్ని మార్చాలని ఈ జంటలు భావించాయి. ఈ విషయాన్ని పెద్దలకు తెలిపాయి. వారు దీనికి అంగీకరించారు. ప్రభురాజు మెడలో అంకిత, అమిత్​ మెడలో ప్రియ తాళి కట్టారు.

ఆదర్శ వివాహం

ఈ కొత్త సంప్రదాయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వధూవరుల కుటుంబ సభ్యులు. వివాహం కోసం ప్రత్యేకంగా ముహుర్తమూ నిశ్చయించలేదు పెద్దలు.

ABOUT THE AUTHOR

...view details