తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం: రేపు ఉదయం 10.30కు సుప్రీం తీర్పు - సుప్రీం

కర్ణాటకీయం: రెబల్స్​ పిటిషన్​పై కాసేపట్లో సుప్రీం విచారణ

By

Published : Jul 16, 2019, 9:56 AM IST

Updated : Jul 16, 2019, 4:18 PM IST

15:26 July 16

రేపు ఉదయం 10.30కు...

వాదోపవాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం రేపు ఉదయం 10.30 గంటలకు రెబల్​ ఎమ్మెల్యేల పిటిషన్​పై తీర్పు వెలువరించనుంది. ఎమ్మెల్యేల తరఫున రోహత్గి, స్పీకర్​ తరఫున సింఘ్వీ, సీఎం తరఫున రాజీవ్​​ ధావన్​ సుదీర్ఘ వాదనలు వినిపించారు. కుమారస్వామి సర్కారు గురువారం విధానసభలో బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ తరుణంలో రేపు సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

15:11 July 16

సీఎం తరఫున రాజీవ్​​ ధావన్​...

ముఖ్యమంత్రి కుమారస్వామి తరఫున సీనియర్​ న్యాయవాది కాజీవ్​ ​ధావన్​ వాదనలు వినిపిస్తున్నారు.

కాలపరిమితి లోపు ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోమని స్పీకర్​ను ఒత్తిడి చేయలేం: ధావన్​

కుమారస్వామి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే రెబల్​ ఎమ్మెల్యేలు కలసి ముంబయికి వెళ్లారు: ధావన్​

ఇది స్పీకర్​కు కోర్టుకు మధ్య వివాదం కాదు. ఒక ముఖ్యమంత్రికి... సర్కారును కూలగొట్టి ముఖ్యమంత్రి అవుదామనుకుంటున్న వ్యక్తికి మధ్య వివాదం: ధావన్​

రాజీనామాలపై స్పీకర్​ను నిర్ణయం తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అధికారం కోర్టుకు లేదు: ధావన్​

రెబల్​ ఎమ్మెల్యేల పిటిషన్​ విచారణకు కోర్టు అంగీకరించకుండా ఉండాల్సింది : ధావన్​

14:51 July 16

రోషన్​ బేగ్​ విడుదల...

ఈ రోజు ఉదయం బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొన్న ఎమ్మెల్యే రోషన్​ బేగ్​ను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పూర్తయ్యాక ఆయన ఇంటి వద్ద విడిచిపెట్టింది. జులై 19న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. 

14:45 July 16

తిరిగి ప్రారంభమైన వాదనలు...

  • కర్ణాటక స్పీకర్, అసంతృప్త ఎమ్మెల్యేల పిటిషన్లపై తిరిగి ప్రారంభమైన వాదనలు
  • స్పీకర్ తరఫున వాదనలు వినిపిస్తోన్న న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ
  • అసంతృప్త ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపిస్తోన్న ముకుల్ రోహత్గి
  • అనర్హత వేటు వేయాలన్న ఉద్దేశంతోనే రాజీనామాలు ఆమోదించలేదు: రోహత్గి
  • అనర్హత వేటు వేయాలని కోరకముందే ఎమ్మెల్యేలు 6వ తేదీన రాజీనామా చేశారు: రోహత్గి
  • ఎమ్మెల్యేలు 11న స్పీకర్‌ని స్వయంగా కలిసి రాజీనామాలు సరైన పద్ధతిలో ఇచ్చారు: సింఘ్వీ
  • అంతకుముందు రోజు 10వ తేదీన అనర్హత ఫిర్యాదు అందింది: సింఘ్వీ
  • స్పీకర్ తొలుత అనర్హత ఫిర్యాదు మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది: సింఘ్వీ
  • 6వ తేదీన ఇచ్చిన రాజీనామాలు సరైన పద్ధతిలో స్పీకర్‌కు చేరలేదు: సింఘ్వీ

13:22 July 16

రేపటి కల్లా నిర్ణయం....

కర్ణాటక రెబల్​ ఎమ్మెల్యేల పిటిషన్​పై సుప్రీం కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. స్పీకర్​ రమేశ్ కుమార్​ తరఫున సీనియర్​ న్యాయవాది అభిషేక్​ మను సంఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హత, రాజీనామా విషయాలపై రేపటి కల్లా స్పీకర్​ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే జులై 12న స్పీకర్​కు సుప్రీం ఇచ్చిన నిలుపుదల ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని అభ్యర్థించారు సింఘ్వీ.

రాజీనామా విషయాలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎవరూ కాలపరిమితి విధించరాదని సింఘ్వీ తెలిపారు. రాజీనామాల కంటే ముందు అనర్హత ఫిర్యాదుకే ప్రాధాన్యం ఉంటుందని సింఘ్వీ స్పష్టం చేశారు. ఫిబ్రవరి నుంచి అనర్హత ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. స్పీకర్ ముందు అనర్హత ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే స్పీకర్‌ను కలిసి రాజీనామా ఇస్తే ఆమోదించదగినదిగా పరిగణిస్తారని.. కానీ 10 మంది ఎమ్మెల్యేలు కోర్టు ఆదేశాలు ఇస్తే వచ్చి స్పీకర్‌ను కలిశారని సింఘ్వీ వాదించారు.
 

12:59 July 16

వాడివేడి వాదనలు...

  • స్పీకర్ తరఫున వాదనలు వినిపిస్తోన్న న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి
  • సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా కొనసాగుతున్న వాదనలు
  • రాజీనామాల కంటే ముందు అనర్హత ఫిర్యాదుకే ప్రాధాన్యం ఉంటుంది: సింఘ్వి
  • ఫిబ్రవరి నుంచి అనర్హత ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి: సింఘ్వి
  • స్పీకర్ ముందు అనర్హత ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది: సింఘ్వి
  • ఎమ్మెల్యే స్పీకర్‌ను కలిసి రాజీనామా ఇస్తే ఆమోదించదగినదిగా పరిగణిస్తారు: సింఘ్వి
  • కానీ 10 మంది ఎమ్మెల్యేలు కోర్టు ఆదేశాలు ఇస్తే వచ్చి స్పీకర్‌ను కలిశారు: సింఘ్వి
  • పదో షెడ్యూల్, ఆర్టికల్ 190 పరస్పరం ముడిపడి ఉన్నాయా అని అడిగిన జస్టిస్ అనిరుద్ధ బోస్
  • ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్న న్యాయవాది సింఘ్వి
  • అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాజీనామాలు మార్గం కాదు: సింఘ్వి

సీజేఐ ప్రశ్నలు...

  • ఆరో తేదీన చేసిన రాజీనామాలను ఆమోదించడం లేదా తిరస్కరించడం వంటి నిర్ణయం స్పీకర్ ఎందుకు తీసుకోలేదు?: సీజేఐ 
  • ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించే వరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు : సీజేఐ 

సింఘ్వి జవాబు...

  • ఒకవేళ కోర్టు అనుమతి ఇస్తే రేపు రాజీనామాలు, అనర్హత ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు :  సింఘ్వి
  • కానీ నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు కోర్టు ఆదేశాలు ఇవ్వలేదు : సింఘ్వి
  • స్పీకర్ విచక్షణాధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు : సింఘ్వి
  • అనుభవం ఉన్న స్పీకర్​గా పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు : సింఘ్వి
  • జులై 12న స్పీకర్ కు ఇచ్చిన ఆదేశాలను మార్చాలని కోరిన సింఘ్వి

12:34 July 16

స్పీకర్​ ఏం చేయలేదు..?

  • ఎమ్మెల్యేలు కోర్టు గడప తొక్కే వరకు సభాపతి ఏ చర్యలు తీసకులేదు: సుప్రీం

12:05 July 16

అనర్హత వేటుపై స్పీకర్​ తరఫున గళం...

  • అనర్హత వేటు అంశంపై స్పీకర్​ తరఫున సీనియర్​ న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ వాదనలు.
  • అనర్హత అంశాన్నే ముందు పరిగణలోకి తీసుకోవాలని సింఘ్వీ వాదన.

11:59 July 16

రెబల్స్​ తరఫు వాదనలు...

వాదనల సందర్భంగా అసంతృప్త ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి...అనర్హత వేటు వేయాలనే ఉద్దేశంతోనే రాజీనామాలను ఆమోదించడం లేదన్నారు. అనర్హత వేటు వేయాలని కోరకముందే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ నెల 6వ తేదీన రాజీనామాలు చేస్తే అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను 10వ తేదీన పార్టీలు కోరాయన్నారు. ఇద్దరు మాత్రమే అనర్హత వేటు వేయాలని కోరిన తర్వాత రాజీనామా చేశారని ఆయన స్పష్టంచేశారు.

ఈనెల 11న 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇచ్చి సరైన ఫార్మాట్‌లో మరోసారి రాజీనామాలు సమర్పించారని రోహత్గి చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటువేయాలని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని, ఈ మేరకు విప్ కూడా జారీచేశారని కోర్టుకు వివరించారు. రాజీనామాలు ఆమోదించడం మినహా సభాపతికి వేరే దారిలేదని రోహత్గీ స్పష్టంచేశారు.

అనర్హత పిటిషన్లపై విచారణ.. రాజీనామాల ఆమోదం వేర్వేరు విషయాలని ఆయన వాదించారు. అనర్హత పిటిషన్లు కేవలం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను బలిచేయడం కోసమే తప్ప మరొకటి కాదన్నారు. ఎమ్మెల్యేలు భాజపాతో కలిసి కుట్ర పన్నారనేందుకు ఎలాంటి ఆధారాల్లేవని రోహత్గీ స్పష్టంచేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం మైనార్టీలో పడుతుందనే ఉద్దేశంతోనే స్పీకర్‌ రాజీనామాలు ఆమోదించడంలేదని, బలపరీక్షలో అనుకూలంగా ఓటు వేయాలని బలవంతంగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని రోహత్గి వాదించారు.

11:29 July 16

రోహత్గి వాదనలు...

  • కర్ణాటక స్పీకర్​కు రాజీనామా ఆమోదించడం తప్ప వేరే దారి లేదని రోహత్గి వాదన
  • గురువారం విధానసభలో బలపరీక్ష ఉందని సుప్రీం ముందు రోహత్గి ప్రస్తావన.
  • రెబల్​ ఎమ్మెల్యేలపై విప్​ జారీ చేసి ఓటింగ్​లో పాల్గొనేలా చేద్దామనుకుంటున్నారని రోహత్గి వాదన

11:03 July 16

ఏం జరుగుతోంది..?

  • కర్ణాటక స్పీకర్, అసంతృప్త ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
  • అసంతృప్త ఎమ్మెల్యేల తరఫున వాదనలు వినిపిస్తోన్న సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి
  • అనర్హత వేటు వేయాలన్న ఉద్దేశంతో రాజీనామాలను ఆమోదించలేదు: రోహత్గి
  • అనర్హత వేటు వేయాలని కోరకముందే ఎమ్మెల్యేలు 6వ తేదీన రాజీనామా చేశారు: రోహత్గి
  • అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను పార్టీలు 10వ తేదీన కోరాయి: రోహత్గి
  • ఇద్దరు మాత్రమే అనర్హత వేటు వేయాలని కోరిన తర్వాత రాజీనామా చేశారు: రోహత్గి

10:57 July 16

విచారణ ప్రారంభం...

15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటిషన్​పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఒకవేళ వీరి రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్​కు ఆదేశాలిస్తే.. కుమారస్వామి సర్కారు గద్దె దిగక తప్పదని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉండనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గురువారం విధాన సభలో కుమారస్వామి సర్కారు బలపరీక్ష ఎదుర్కోనుంది.

09:57 July 16

మొత్తం 15 మంది పిటిషన్లపై...

అధికార, ప్రతిపక్షాల ఎత్తులు, పైఎత్తులను దాటుకుని సుప్రీం కోర్టును చేరింది కన్నడ రాజకీయ నాటకం. రెబల్​ ఎమ్మెల్యేల రాజీనామాపై కాసేపట్లో విచారణ చేయనుంది సర్వోన్నత న్యాయస్థానం. కాంగ్రెస్​-జేడీఎస్​ సంకీర్ణ ప్రభుత్వంలో మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరిలో 10 మంది శాసనసభ్యులు తమ రాజీనామాల్ని ఆమోదించేలా స్పీకర్​కు ఆదేశాలివ్వాలని సుప్రీంను ఆశ్రయించారు. అనంతరం.. మరో ఐదుగురు అదే బాట పట్టారు. వీరి వ్యాజ్యాలపై నేడు వాదనలు విననుంది అత్యున్నత న్యాయస్థానం.

16 మందిలో కాంగ్రెస్​ నుంచి 13, జేడీఎస్​ నుంచి ముగ్గురు శాసనసభ్యులున్నారు. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు శంకర్​, నగేశ్​ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.

09:46 July 16

కాసేపట్లో విచారణ...

కర్ణాటక సంకీర్ణ సర్కారుపై అసంతృప్తితో రాజీనామాలు చేసిన రెబల్​ ఎమ్మెల్యేల రాజీనామా ఆమోద వ్యాజ్యాలపై కాసేపట్లో విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. ఒకవేళ వీరి రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్​కు ఆదేశాలిస్తే.. కుమారస్వామి సర్కారు గద్దె దిగక తప్పదని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉండనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Last Updated : Jul 16, 2019, 4:18 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details