తెలంగాణ

telangana

By

Published : Jul 15, 2019, 12:59 PM IST

Updated : Jul 15, 2019, 2:48 PM IST

ETV Bharat / bharat

15 మంది రెబల్స్​ పిటిషన్​పై రేపు సుప్రీం విచారణ

తమ రాజీనామాలను స్పీకర్​ ఆమోదించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కర్ణాటకకు చెందిన ఐదుగురు రెబల్​ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్​ విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇప్పటికే విచారణలో ఉన్న మరో 10 అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్లతో కలిపి మంగళవారం వాదనలు వింటామని తెలిపింది.

రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్ల విచారణకు సుప్రీం అంగీకారం

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ తమ రాజీనామాలు ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఐదుగురు అసమ్మతి ఎమ్మెల్యేలు వేసిన వ్యాజ్యంపై వాదనలు వినేందుకు అంగీకరించింది. ఇంతకుముందే కోర్టును ఆశ్రయించిన 10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యాజ్యంతో కలిపి మంగళవారం విచారిస్తామని స్పష్టం చేసింది.

సుప్రీం చెంతకు..

కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు కొద్దిరోజుల క్రితమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం జులై 16 వరకు ఈ ఎమ్మెల్యేల రాజీనామా, అనర్హతలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకువద్దని స్పీకర్​ రమేశ్​కుమార్​కు సూచించింది.

కాంగ్రెస్​కు చెందిన మరో ఐదుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. ఆనంద్​సింగ్​, కె.సుధాకర్​, ఎన్​ నాగరాజ్, మునిరత్నం, రోషన్​బేగ్​ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తేలనున్న సంకీర్ణ ప్రభుత్వం భవితవ్యం

తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలతో కుమారస్వామి ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. తాజాగా బలనిరూపణ చేసుకోవాలని స్పీకర్ రమేశ్​కుమార్ కుమారస్వామి ప్రభుత్వాన్ని ఆదేశించారు. గురువారం కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్ష జరగనుంది. సంకీర్ణ సర్కారు భవితవ్యం తేలిపోనుంది.

ఇదీ చూడండి: కర్ణాటకీయం: నేడు సర్కారుకు బలపరీక్ష తప్పదా..?

Last Updated : Jul 15, 2019, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details