దక్షిణాదిన 'కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ'ని రద్దుచేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎప్పటిలాగే కొనసాగుతారని స్పష్టం చేసింది. అంతర్గత విబేధాలు, అసమ్మతి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
"ప్రస్తుత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని రద్దు చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వహక అధ్యక్షుడు మాత్రం కొనసాగుతారు."
- కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి