కరోనా వైరస్ బారినపడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.. బెంగళూరులోని మనిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. వైద్యుల బృందం ముఖ్యమంత్రిని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటుందని ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి.
మరోవైపు యడియూరప్ప కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె కూడా మనిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.