తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయానికి తెర.. భాజపా డబుల్ సిక్సర్​​.. యడ్డీ సేఫ్​

Karnataka by poll counting
కర్ణాటక 'ఉప' పోరు: మరికాసేపట్లో కౌంటింగ్ షురూ

By

Published : Dec 9, 2019, 7:45 AM IST

Updated : Dec 9, 2019, 4:02 PM IST

15:56 December 09

సిద్ధరామయ్య రాజీనామా...

కర్ణాటక ఉపఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవం అనంతరం కాంగ్రెస్​ శాసనసభా పక్ష నేత పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. శాసనసభ ప్రతిపక్ష నేతగానూ తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు.

15 సీట్లకు జరిగిన ఉపఎన్నికల పోరులో కాంగ్రెస్​ కేవలం 2 సీట్లే దక్కించుకుంది. జేడీఎస్​ అసలు ఖాతా కూడా తెరవలేదు.

14:26 December 09

తిరుగులేని భాజపా.. 12 స్థానాలు కైవసం

కర్ణాటకలో యడియూరప్ప సర్కార్‌కు అగ్నిపరీక్షగా మారిన ఉప ఎన్నికల ఫలితాల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యం సాధించి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంది. ఎగ్జిట్‌ పోల్స్​ ఫలితాలకు మించి 12 స్థానాలను కైవసం చేసుకుంది కాషాయదళం. కుమారుస్వామి సర్కార్‌పై తిరుగుబాటు చేసి అనర్హతకు గురైన వారిలో 13 మందికి భాజపా టికెట్లు ఇవ్వగా.. 12 మంది విజయఢంకా మోగించడం విశేషం. 

తొలుత యెల్లపుర నియోజకవర్గంలో బోణి చేసిన కమలం పార్టీ.. ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో 12 సీట్లను ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్‌ రెండు చోట్ల విజయం సాధించగా.. మరో చోట భాజపా రెబల్ ఎమ్మెల్యే విజయఢంకా మోగించారు. ఈ ఉప ఎన్నికల్లో జేడీఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఉప ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చినందున భాజపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం యడియూరప్ప.. తన కుమారుడితో పాటు పార్టీ నేతలకు  మిఠాయిలు తినిపించారు. 

ప్రజా తీర్పు సంతోషకరంగా ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూడురన్నరేళ్లు సుస్థిర ప్రభుత్వాన్ని అందించేందుకు అవకాశం ఇచ్చారు. ప్రజానుకూల ప్రభుత్వాన్ని అందిస్తాం. వచ్చే ఎన్నికల్లో 150 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నా... అందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి   నా వంతు ప్రయత్నం చేస్తా. రెండుమూడు రోజుల్లో దిల్లీ వెళ్తా. మాకు మద్దతు ఇచ్చిన వారికి కేబినెట్‌లో తప్పకుండా అవకాశం కల్పిస్తాం. 
- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

 

11:59 December 09

భాజపా సిక్సర్​.. యడ్డీకి నో టెన్షన్​

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలతో యడియూరప్ప నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం గట్టెక్కింది. ఫలితాల్లో ఇప్పటికే ఆరు చోట్ల కాషాయ పార్టీ విజయం సాధించగా.. మరో 6 చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఫలితంగా స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ లభించింది. ఇక కాంగ్రెస్‌ ఒక చోట విజయం సాధించగా.. మరో చోట ముందంజలో ఉంది. 

11:53 December 09

భాజపా: విజయం 4.. ఆధిక్యం 8

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో కాషాయ పార్టీ జయకేతనం ఎగురవేస్తోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. భాజపా 4 చోట్ల విజయం సాధించగా.. మరో 8 చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తోంది. భాజపా అభ్యర్థులు శివరామ్‌ హెబ్బర్.. యల్లాపురలో, నారాయణ గౌడ.. కేఆర్‌ పేటలో, సుధాకర్‌.. చిక్కబళ్లాపురలో, బీసీ పాటిల్‌.. హీరేకెరూరులో విజయం సాధించారు. 

11:46 December 09

కుమారుడితో కలిసి యడ్డీ సంబరం

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్నందున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సంబరాల్లో మునిగిపోయారు. కుమారుడు విజయేంద్రకు మిఠాయి తినిపిస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. 

09:08 December 09

ఆధిక్యంలో దూసుకెళ్తున్న భాజపా

ఎగ్జిట్‌ పోల్ సర్వే ఫలితాలకు అనుగుణంగా కర్ణాటక ఉపఎన్నికల్లో భాజపా మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. జేడీఎస్, కాంగ్రెస్‌లు అధిక్యంలో వెనుకబడి ఉన్నాయి.  9 నుంచి 12 స్థానాలు భాజపా కైవసం చేసుకుంటుందని పలు సర్వేలు ప్రకటించాయి. అందుకు అనుగుణంగానే మెజార్టీ స్థానాల్లో భాజపా అధిక్యంలోకి దూసుకెళ్తోంది.

08:00 December 09

కౌంటింగ్ మొదలు..

కర్ణాటకలో ఉపఎన్నికలు జరిగిన 15 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 15 కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది .  ఎన్నికల ఫలితాలతో భాజపా ప్రభుత్వ భవితవ్యం తేలనుంది. 

కాంగ్రెస్-జేడీఎస్​ కూటమికి చెందిన 17మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన తర్వాత  కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జులైలో పతనమైంది. స్పీకర్ చర్యతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 225 నుంచి 208 తగ్గింది. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న భాజపా.... యడియూరప్ప నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

డిసెంబర్ 5న 17 స్థానాల్లో 15 సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి.  హైకోర్టులో కేసుల కారణంగా మిగిలిన  రెండు సీట్లకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో భాజపా తిరిగి అధికారం నిలబెట్టుకోవాలంటే....15 స్థానాల్లో కనీసం ఆరింటిలో గెలవాల్సి ఉంది. ఇప్పటికే భాజపా గెలుపు ఖాయమని పలు ఎగ్జిట్  ఫోల్ సర్వేలు వెల్లడించాయి. 9 నుంచి 12 స్థానాలు భాజపా కైవసం చేసుకుంటుందని సర్వేలు ప్రకటించాయి. మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

07:49 December 09

8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటిగ్

కర్ణాటకలో ఉపఎన్నికలు జరిగిన 15 అసెంబ్లీ స్థానాలకు మరికాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 11 కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసింది .  ఎన్నికల ఫలితాలతో భాజపా ప్రభుత్వ భవితవ్యం తేలనుంది. 

కాంగ్రెస్-జేడీఎస్​ కూటమికి చెందిన 17మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన తర్వాత  కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జులైలో పతనమైంది. స్పీకర్ చర్యతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 225 నుంచి 208 తగ్గింది. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న భాజపా.... యడియూరప్ప నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

డిసెంబర్ 5న 17 స్థానాల్లో 15 సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి.  హైకోర్టులో కేసుల కారణంగా మిగిలిన  రెండు సీట్లకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో భాజపా తిరిగి అధికారం నిలబెట్టుకోవాలంటే....15 స్థానాల్లో కనీసం ఆరింటిలో గెలవాల్సి ఉంది. ఇప్పటికే భాజపా గెలుపు ఖాయమని పలు ఎగ్జిట్  ఫోల్ సర్వేలు వెల్లడించాయి. 9 నుంచి 12 స్థానాలు భాజపా కైవసం చేసుకుంటుందని సర్వేలు ప్రకటించాయి. మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

07:21 December 09

కర్ణాటక 'ఉప' పోరు: మరికాసేపట్లో కౌంటింగ్ షురూ

కర్ణాటకలో భాజపా ప్రభుత్వ భవితవ్యం ఈరోజు తేలనుంది. ఉపఎన్నికలు జరిగిన 15 అసెంబ్లీ స్థానాలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్​ నేపథ్యంలో.. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఆరు స్థానాల్లో గెలుపు అనివార్యం...

డిసెంబర్ 5న 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 67.91 శాతం పోలింగ్ నమోదైంది. నేడు వెలువడే ఫలితాల అనంతరం భాజపా తిరిగి అధికారం నిలబెట్టుకోవాలంటే 15 స్థానాల్లో కనీసం ఆరు గెలవాలి.

భాజపాదే గెలుపు!

ఇప్పటికే భాజపా గెలుపు ఖాయమని ఎగ్జిట్‌ పోల్ సర్వేలు స్పష్టం చేశాయి. 9 నుంచి 12 స్థానాలు భాజపా కైవసం చేసుకుంటుందని స్థానిక వార్తా సంస్థల సర్వేలు ప్రకటించాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

విజయం కోసం పార్టీల నేతల పూజలు..

నేడు ఫలితాలు వెలువడనున్న తరుణంలో విజయం తమకే దక్కాలని ఆయా పార్టీల నేతలు ఆలయాలు, మఠాలను ఆదివారం సందర్శించారు. ముఖ్యమంత్రి యడియూరప్ప దర్మస్థలలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంజునాథుని ఆశీర్వాదాలు కోరారు.

మాజీ ప్రధాని, జేడీఎస్​ వ్యవస్థాపకుడు దేవె గౌడ.. షిరిడిలోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఎవరికెంత బలం

225 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థులతో కలిపి భాజపాకు 105 మంది సభ్యుల మద్దతు ఉంది. కాంగ్రెస్​కు 66, జేడీఎస్​కు 34 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారు. వీరు కాకుండా స్పీకర్​, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే, బీఎస్​పీ శాసనసభ్యుడు ఉన్నారు.

ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో ఎన్నికలు అనివార్యం...

కాంగ్రెస్-జేడీఎస్​ కూటమికి చెందిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ అనర్హత వేటు వేసిన తర్వాత కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జులైలో పతనమైంది. స్పీకర్ చర్యతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 225 నుంచి 208 తగ్గింది. దీంతో ఆధిక్యానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 105కు చేరింది భాజపా.

105 మంది ఎమ్మెల్యేలు ఉన్న యడియూరప్ప నేతృత్వంలో భాజపా... బలపరీక్షలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 సీట్లకు డిసెంబర్ 5న ఎన్నికలు నిర్వహించగా..​ హైకోర్టు కేసుల కారణంగా మిగిలిన రెండు సీట్లకు ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Last Updated : Dec 9, 2019, 4:02 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details