కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్పను తప్పించి.. పాలక వర్గంలో కీలక మార్పులు చేయనున్నట్లు వస్తున్న వార్తలను ఆ రాష్ట్ర భాజపా వర్గాలు ఖండించాయి. అవన్నీ నిరాధారమైన, తప్పుదోవ పట్టించే వార్తలని స్పష్టంచేశాయి.
ఉహాగానాలు ఇలా..

యడియూరప్ప వయస్సు పరిగణనలోకి తీసుకుని ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే యోచనలో భాజపా అధిష్ఠానం ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. 77 ఏళ్ల యడియూరప్ప ఇటీవల దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులు, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవడం వల్ల ఈ వార్తలు మరింత జోరందుకున్నాయి. బిహార్ ఎన్నికల తర్వాత లేదా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2021 మార్చిలో యడియూరప్పను పదవి నుంచి తప్పించాలని భాజపా అధినాయకత్వం యోచిస్తోందన్నది ఆ వార్తల సారాంశం.
అయితే అవన్నీ అవాస్తమని తేల్చిచెప్పారు కర్ణాటక భాజపా అధికార ప్రతినిధి కెప్టెన్ గణేశ్ కర్ణిక్.
ఇదీ చూడండి:నవంబర్ 1 నుంచి క్లాసులు- వేసవి సెలవులు కట్