కర్ణాటక విధాన సౌధలో అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు స్పీకర్ రమేశ్ కుమార్. శాసన సభ్యులు సరైన ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించారని తెలిపారు. రాజీనామాలు స్వచ్ఛందంగా, సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలిస్తానన్నారు. గతంలో ఇచ్చిన వాటిలో 8 రాజీనామాలు సరైన ఫార్మాట్‌లో లేవని తెలిపారు రమేశ్. రేపటిలోగా ఎమ్మెల్యేల రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై వీడియో రూపంలో సమాధానం పంపిస్తానని తెలిపారు.
రాజీనామాలను పరిశీలించాకే నిర్ణయం: కర్ణాటక స్పీకర్ - స్పీకర్
కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేలు సరైన ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించారని స్పీకర్ రమేశ్ కుమార్ తెలిపారు. వీటిని సోమవారం పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 10 మంది శాసన సభ్యులతో భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు రమేశ్.
రాజీనామాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటా: స్పీకర్
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం స్పీకర్ను కలిసేందుకు ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్న 10 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు కర్ణాటక విధాన సౌధలో స్పీకర్ను కలిశారు.
Last Updated : Jul 11, 2019, 8:50 PM IST