తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్విట్టర్​లో కుమారస్వామి x సిద్ధ రామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ట్విట్టర్​ వేదికగా విమర్శలకు దిగారు. కాంగ్రెస్​ సీనియర్​నేత మల్లిఖార్జున ఖర్గేపై కుమారస్వామి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమయ్యాయి.

By

Published : May 17, 2019, 5:02 AM IST

ట్విట్టర్​లో కుమారస్వామి x సిద్ధ రామయ్య

ట్విట్టర్​లో కుమారస్వామి x సిద్ధ రామయ్య

మొన్నటిదాకా రోజుకో మలుపు తిరగుతూ అందరి దృష్టినీ ఆకర్షించిన కర్ణాటక రాజకీయాలు... తాజాగా మరోసారి రసవత్తరంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్​-జేడీఎస్​ పార్టీ అగ్రనేతలు ట్విట్టర్​ వేదికగా ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. కాంగ్రెస్​ సీనియర్​నేత మల్లిఖార్జున ఖర్గేపై ముఖ్యమంత్రి హెచ్.​డీ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.

ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్​ పార్టీకి సేవలందిస్తోన్న ఖర్గేకు పార్టీ అధినేతలు అత్యున్నత పదవిని అందించాలన్నారు కుమారస్వామి. ఈ వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్​ అధినేత సిద్ధరామయ్యను ఉద్దేశించి అన్నారని భావించాయి ఆ పార్టీ వర్గాలు. కాంగ్రెస్ ​పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధరామయ్యను కాదని ఖర్గేను దించాలని చెప్పడానికే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారన్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి వ్యాఖ్యలపై స్పందించారు సిద్ధరామయ్య. సమయం వస్తే ఎవరైనా ఏ పదవినైనా అధిరోహించొచ్చని ట్వీట్​ చేశారు.

ట్విట్టర్​లో కుమారస్వామి x సిద్ధ రామయ్య

"కుమారస్వామి ఏం చెప్పారో అది నిజమే. ముఖ్యమంత్రితో పాటు అంతకన్నా ఎక్కువ హోదా ఉన్న పదవుల్లో ఉండే సత్తువ మల్లిఖార్జున ఖర్గేకు ఉంది. కాంగ్రెస్​, జేడీఎస్​ ఇరుపార్టీల్లోనూ ముఖ్యమంత్రి పదవి చేపట్టగలిగే నేతలు కొంతమంది ఉన్నారు. హెచ్​.డీ రేవన్న కూడా వారిలో ఒకరు. దేనికైనా సమయం రావాలి."
-సిద్ధరామయ్య, కాంగ్రెస్​ సీనియర్​ నేత

అయితే తాను రాజకీయలబ్ధి కోసం ఈ వ్యాఖ్యలు చేయలేదని ట్వీట్​ చేశారు కుమారస్వామి.

ట్విట్టర్​లో కుమారస్వామి x సిద్ధ రామయ్య

"ఈ ప్రకటన ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న కోరిక నాకు లేదు. పార్టీకి ఖర్గే అందించిన సేవలను మనం మర్చిపోకూడదు."
- హెచ్​డీ కుమారస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి

ఇదీ చూడండి : ఖర్గే ఎప్పుడో సీఎం కావాల్సింది:కుమారస్వామి

ABOUT THE AUTHOR

...view details