తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకీయం మళ్లీ వాయిదా.. 22న విశ్వాస పరీక్ష..!

కన్నడనాట రాజకీయ సంక్షోభం కొలిక్కివచ్చేందుకు మరింత సమయం పట్టనుంది. అసెంబ్లీ మరోసారి వాయిదా పడింది. విశ్వాస పరీక్షకు సంబంధించి ఎలాంటి ఓటింగ్​ జరగకుండానే సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్​.

By

Published : Jul 19, 2019, 10:01 PM IST

Updated : Jul 19, 2019, 11:54 PM IST

కర్ణాటకీయం మళ్లీ వాయిదా.. 22న విశ్వాస పరీక్ష..!

కర్ణాటకీయం వాయిదా.. తేలని ఫలితం.

కర్ణాటక రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కీలక మలుపులు తిరుగుతున్నాయి. విశ్వాస పరీక్ష కోసం మరికొన్ని రోజులు వేచిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. శుక్రవారం ఓ కొలిక్కివస్తుందనుకున్న రాజకీయ సంక్షోభం అలాగే సాగనుంది.

విశ్వాస పరీక్షకు సంబంధించి ఓటింగ్​ జరగకుండానే సభను సోమవారానికి(జులై 22) వాయిదా వేశారు స్పీకర్​ రమేశ్​ కుమార్​. శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్​ రెండుసార్లు గడువు పెట్టినప్పటికీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సభాపతి రమేశ్​ కుమార్​ పెద్దగా పట్టించుకోలేదు.

సుప్రీంను ఆశ్రయించిన సీఎం, గుండూరావు..

విశ్వాస తీర్మానంపై చర్చ సాగుతుండగా.. సీఎం, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్​ గుండూరావు విప్​ విషయంలో స్పష్టత కోరుతూ వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పార్టీ విప్‌ విషయంలో ఈ నెల 17న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో అస్పష్టత నెలకొందని, దీనిపై పునఃసమీక్షించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్‌ జోక్యాన్నీ ప్రస్తావించారు. ఫలితంగా.. ఈ కన్నడ రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అందరికీ అవకాశం..

విశ్వాస పరీక్షపై ప్రతి ఒక్కరూ మాట్లాడేలా అవకాశం కల్పిస్తున్నారు స్పీకర్​. ఫలితంగా.. ఈ వ్యవహారం ముగిసేసరికి రెండు, మూడు రోజులు పట్టేలా ఉంది. అదే అదనుగా.. సభను వాయిదా వేయాలని కోరారు కూటమి నేతలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళే బలపరీక్ష చేపట్టాలని భాజపా నినాదాలు చేసింది. ఆందోళనల నడుమ సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్​.

Last Updated : Jul 19, 2019, 11:54 PM IST

ABOUT THE AUTHOR

...view details