ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు - కార్తీక పౌర్ణమి సంబరాలు

దేశమంతటా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తలు ఆలయాలకు బారులు తీరారు. దీపాలను వెలిగించి మొక్కులను చెల్లించుకున్నారు.

karhik purnima celebrations in india
అంబరాన్ని తాకేలా కార్తీక పౌర్ణమి సంబరాలు
author img

By

Published : Nov 30, 2020, 11:35 AM IST

దేశవ్యాప్తంగా కార్తీకపౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. నదుల్లో తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. ఆలయాల్లో దీపాలు వెలిగించి.. ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, యువతులు భారీగా ఆలయాలకు బారులు తీరారు.

in article image
వారణాసిలో నదీ స్నానమాచరిస్తున్న భక్తులు

అయోధ్యలో సరయూ నది ఒడ్డున గల రామ్​ కీ పైడీ ప్రాంతంలో 51,000 దీపాలను భక్తులు వెలిగించారు.

అయోధ్యలో కార్తీకపౌర్ణమి ఉత్సవాలు

కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి దేవస్థానం సరికొత్త శోభను సంతరించుకుంది. ఆలయం ప్రాంగణంలో భక్తులు దీపాలను వెలిగించారు.

శబరిమల దేవస్థానంలో వేడుకలు
శబరిమల దేవస్థానంలో వేడుకలు

రాయ్​పుర్​లోని మహాదేవ్​ ఘాట్​లో ఛత్తీస్​గఢ్ మఖ్యమంత్రి భూపేశ్​​ బఘేల్​ పుణ్యస్నానాలు చేశారు.

వూజలో పాల్గొన్న ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​

కార్తీక పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయంలో 'చొక్కపనాయ్'​ ఉత్సవాలను నిర్వహించారు.

తమిళనాడులో కార్తీకపౌర్ణమి వేడుకలు

ప్రయాగ్​రాజ్​లోని త్రివేణి సంగమం వద్ద భక్తలు ప్రత్యేక పూజలు చేశారు. పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

ఇదీ చూడండి:నేడు ప్రధాని మోదీ వారణాసి పర్యటన

ABOUT THE AUTHOR

...view details