కేరళ సహా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగాలతో అరెస్టయిన వ్యక్తికి... జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఉగ్ర సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి వారి ప్రోద్భలంతో దాడులకు ప్రయత్నించారన్న కారణంగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న ఆరుగురు వ్యక్తులకు సైతం శిక్ష విధించింది న్యాయస్థానం.
ప్రధాన నిందితుడైన మన్సీద్ మహమూద్ సహా ఐదుగురిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం ప్రకారం ఐపీసీ సెక్షన్ల కింద కేసుల నమోదయ్యాయి. మన్సీద్కు 14 ఏళ్లు, రెండో ప్రధాన నిందితుడు స్వాలీహ్ మహ్మద్‌కు 10 ఏళ్లు, మూడో నిందితుడైన రషీద్ అలీకి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఇలాంటి కేసుల్లో సానుభూతి ప్రదర్శించే అవకాశమే లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
"ఈ కేసులో నిందితులందరూ ఐఎస్ఐఎస్ ఉగ్రముఠాకు సహకరించడానికి ప్రయత్నించారు. తమ ప్రణాళికలో భాగమయ్యేలా ఇతరులను ప్రోత్సహించినట్లు నిందితుల టెలిగ్రామ్ గ్రూప్ సంభాషణ ద్వారా తెలిసింది. సమగ్ర ప్రణాళిక వివరాలను మాత్రం అందరు సభ్యులతో పంచుకోలేదు. తమ క్రూరమైన ప్రణాళికలను అమలుపరచడానికి వారు మరణించడానికి సైతం లెక్కచేయలేదు. ఇది బాధాకరమైన విషయం. ఇలాంటి కేసుల్లో శిక్ష విధించేటప్పుడు సానుభుతిని దరికి చేరనీయకుండా ఉండటమే ప్రధాన నియమం."
- ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.