మక్కల్ నీది మయ్యమ్ కార్యకర్తలు, అభిమానులు సంయమనంతో వ్యవహరించాలని ఆ పార్టీ అధినేత కమల్ హాసన్ కోరారు. తమిళనాడు తిరుచి ఎన్నికల ప్రచారంలో జరిగిన దాడిపై ఆయన ఈమేరకు స్పందించారు.
"నాకు ఎలాంటి భయంలేదు. కానీ రాజకీయాల్లో నాణ్యత లోపిస్తోంది. తీవ్రవాదులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. చరిత్ర చూస్తే అన్ని మతాల నుంచి వచ్చిన తీవ్రవాదులు కనిపిస్తారు. నేను అదే చెప్పాలనుకున్నా. 'మేం ఆ పనులు చేశామని..' ఎవరూ ఒప్పుకోరు. మంచివాళ్లమనే భావిస్తారు."