తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వేగం కోసం న్యాయం బలి కాకూడదు : సుప్రీం కోర్టు - న్యాయం బలికావద్దు: సుప్రీం వ్యాఖ్య

కేసుల సత్వర పరిష్కార అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులు వేగంగా పరిష్కరించే క్రమంలో న్యాయం సమాధి కాకుండా చూడాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్​ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

justice
న్యాయం బలికావద్దు: సుప్రీం వ్యాఖ్య

By

Published : Dec 21, 2019, 6:35 AM IST

Updated : Dec 21, 2019, 7:11 AM IST

కేసులను వేగంగా పరిష్కరించే క్రమంలో న్యాయం సమాధి కాకుండా చూడాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

"క్రిమినల్‌ నేరాలకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించడం నిస్సందేహంగా అవసరమే. అయితే ఇందుకోసం కేసుల విషయంలో నిష్పాక్షికతను, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఉన్న అవకాశాలను ఫణంగా పెట్టకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ న్యాయం బలి కారాదు."

- సుప్రీం కోర్టు

2013లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మరణశిక్ష విధిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేందుకు అర్హమైన అన్ని కేసుల్లోనూ కోర్టు సహాయకులుగా న్యాయవాదులను నియమించేందుకు వారికి కనీసం 10ఏళ్ల పాటు కోర్టులో ప్రాక్టీస్‌ చేసిన అనుభవం ఉండాలంది.

ఇదీ చూడండి: 'పౌర చట్టం, ఎన్​ఆర్​సీతో పేదలకే ఎక్కువ నష్టం'

Last Updated : Dec 21, 2019, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details