తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం - CJI Oath taking ceremony

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్​ఏ బోబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే ప్రమాణస్వీకారం

By

Published : Nov 18, 2019, 9:48 AM IST

Updated : Nov 18, 2019, 9:57 AM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్​ శరద్​ అరవింద్​ బోబ్డే ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్.. జస్టిస్‌ బోబ్డేతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు,ఎంపీలు,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

17 నెలలు పదవిలో..

సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ బోబ్డే.. 17 నెలలపాటు పదవిలో కొనసాగనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకూ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. జస్టిస్‌ రంజన్‌ గొగొయి పదవీ కాలం ఆదివారం ముగియగా..ఆయన స్థానంలో జస్టిస్‌ బోబ్డే ఈ బాధ్యతలు స్వీకరించారు.

Last Updated : Nov 18, 2019, 9:57 AM IST

ABOUT THE AUTHOR

...view details