జూన్లో అధిక వర్షపాతం నమోదు అయ్యిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ నెల కూడా ఇదే తరహాలో వర్షాలు బాగా కురుస్తాయని అంచనా వేసింది.
ఐఎండీ డేటా ప్రకారం... జూన్లో కురిసిన వర్షపాతం దీర్ఘకాల సగటు(ఎల్పీఏ)లో 118శాతం. అంటే వర్షాలు అధికంగా కురిసాయని అర్థం. దీనితోపాటు ఈ స్థాయిలో తేమ ఉండటం 12ఏళ్లల్లో ఇదే తొలిసారి.
90-96శాతం వర్షపాతం నమోదైతే అది సాధారణం కంటే తక్కువగాను, 96-104శాతం ఉంటే సాధారణ వర్షపాతంగాను పరిగణిస్తారు. 1961-2010 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఎల్పీఏ 88సెంటీమీటర్లు.
గోవా, కోంకణ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉన్న.. మధ్య భారత సబ్డివిజన్లో జూన్ నెలలో ఎల్పీఏలో 131శాతం నమోదైంది. తూర్పు, ఈశాన్య సబ్డివిజన్లో ఇది 116శాతం . వాయువ్య భారతంలో 104శాతం, దక్షిణ ద్వీపకల్పంలో 108శాతం రికార్డు అయ్యింది.
రానున్న 5-10రోజుల్లో మధ్య, దక్షిణ భారతంలో వర్షాలు బాగా కురుస్తాయని అంచనా వేసింది భారత వాతావరణశాఖ.