బంగాల్లో వైద్య విద్యార్థిపై దాడికి వ్యతిరేకంగా చేపడుతున్న సమ్మెకు దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు మద్దతు తెలిపాయి. దిల్లీ ఎయిమ్స్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగాల్లో జూడాల సమ్మె నేటితో నాలుగో రోజుకు చేరుకుంది.
వైద్య సంఘాల నిరసనలు
- దిల్లీ ఎయిమ్స్ వైద్యులు తలకు కట్టుతో ఆందోళన బాట పట్టారు. బంగాల్లో దాడికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ఆసుపత్రి ఎదుట వైద్యులు నిరసన తెలిపారు. స్థానిక వైద్యుల సంఘం (ఆర్డీఏ) సమ్మెతో ఓపీడీ వద్ద పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులూ బెంగాల్ జూడాలకు మద్దతు పలికారు.
- మహారాష్ట్రలో నాగ్‌పుర్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తలకు బ్యాండేజీతో రోడ్డుపై భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యులను కాపాడాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
- ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్ డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ మెమోరియల్ ఆసుపత్రి వైద్యులు విధులను బహిష్కరించారు. న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు.
- రాజస్థాన్ జైపుర్‌లోని జైపూరియా ఆసుపత్రి వైద్యులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
- కేరళ త్రివేండ్రంలో భారత వైద్య సంఘం సభ్యులు ఆందోళనలకు దిగారు.
సీఎం హెచ్చరించినా...