అమిత్ షా నుంచి బాధ్యతలు స్వీకరించిన నడ్డా
భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జేపీ నడ్డా... అమిత్ షా నుంచి బాధ్యతలు స్వీకరించారు.
15:10 January 20
అమిత్ షా నుంచి బాధ్యతలు స్వీకరించిన నడ్డా
భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జేపీ నడ్డా... అమిత్ షా నుంచి బాధ్యతలు స్వీకరించారు.
14:40 January 20
భాజపా అధ్యక్షుడిగా జేపీ నడ్డా...
భాజపా నూతన జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో.. ఏకగ్రీవంగా నియామకమయ్యారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం 4.30 గంటలకు నడ్డాను సన్మానించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
13:30 January 20
నడ్డా నామినేషన్
భాజపా అధ్యక్ష పదవికి జేపీ నడ్డా నామినేషన్ దాఖలు చేశారు.
11:46 January 20
'నడ్డా'కు ప్రధాని మోదీ సన్మానం
భాజపా అధ్యక్షుడిగా అమిత్ షా నుంచి పగ్గాలు అందుకోనున్న జేపీ నడ్డాను ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ సన్మానించనున్నారు. అనంతరం ఇరువురు నేతలు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలతో సమావేశం కానున్నారు.
11:15 January 20
నడ్డా నామినేషన్‌కు కేంద్రమంత్రుల మద్దతు
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి జేపీ నడ్డా అభ్యర్థిత్వాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నిత్న్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు సమర్థించారు. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన నామినేషన్‌కు మద్దతు తెలుపుతూ నామపత్రాలు దాఖలు చేశారు. కమలం పార్టీ అధ్యక్షుడిగా నడ్డా ఎన్నుకోబడతారని తనకు నమ్మకమున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
నామినేషన్ దాఖలు చేసేందుకు భార్యతో కలిసి పార్టీ ప్రధాన కార్యాలయానికి బయలు దేరారు నడ్డా.
10:21 January 20
భాజపా జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతల స్వీకరణ
భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి జేపీ నడ్డా ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా మరికొద్దిసేపట్లో భాజపా అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. నడ్డా తప్పా ఎవరూ నామినేషన్ దాఖలు చేసే పరిస్థితి లేనందున ఆయన ఎన్నిక లాంఛనం కానుంది.
మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత భాజపా జాతీయ అధ్యక్ష పదవికి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ అమిత్ షా చేతిలో ఉన్న కమలం పార్టీ పగ్గాలు నడ్డా చేతిలోకి వెళ్లనున్నాయి.
భాజపా నిబంధనల ప్రకారం దేశంలోని సగం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిశాక అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. ప్రస్తుతం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భాజపా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ముగిసినందున నూతన అధ్యక్షుడి ఎన్నికను నిర్వహిస్తున్నారు.