జర్నలిజం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. నకిలీ వార్తలను కొత్త భూతంగా పేర్కొన్న కోవింద్.. గౌరవమైన వృత్తికి కొందరు కళంకం తెస్తున్నారని వ్యాఖ్యానించారు. దిల్లీలో జరిగిన ప్రతిష్ఠాత్మక 'రామ్నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం' అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన కోవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాజిక, ఆర్థిక అసమానతలను బహిర్గతం చేసే కథనాలకు ప్రాధాన్యం తగ్గుతోందని.. అసలు ప్రాముఖ్యతే లేని వార్తలు దేశమంతా వ్యాపిస్తున్నాయని పేర్కొన్నారు.
బ్రేకింగ్ న్యూస్ వెంటపడి ప్రాథమిక సూత్రాలను మీడియా విస్మరిస్తుందన్నారు రాష్ట్రపతి.
"ప్రస్తుత మీడియాకు 'బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్' అనే వ్యాధి ఉంది. దీని వల్ల సంయమనం, బాధ్యత అనే ప్రాథమిక సూత్రాలను నిర్లక్ష్యం చేస్తున్నారు."
-- రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి