జమ్ముకశ్మీర్లో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి. షోపియాన్, పుల్వామా జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను హతం చేశారు సైనికులు. ఉదయాన్నే పుల్వామాలోని దలిపొరా ప్రాంతంలో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన బలగాలు... షోపియాన్ జిల్లాలో మరో ముగ్గురు ముష్కరులనూ హతమార్చారు.
కశ్మీరులో ఎన్కౌంటర్- ఆరుగురు ముష్కరులు హతం - Pulwama
జమ్ముకశ్మీర్లో వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఓ జవాను అమరుడయ్యాడు. మరో పౌరుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్- ఆరుగురు ఉగ్రవాదులు హతం
హాండ్రూ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు సమాచారం అందుకున్న సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరపడం ఎన్కౌంటర్కు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మరో పౌరుడికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి : పుల్వామా ఎన్కౌంటర్: ముగ్గురు ముష్కరుల హతం