తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విడతల వారీగా కశ్మీర్​ రాజకీయనేతలు విడుదల..! - jammu kashmir political news

కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో గృహనిర్బంధం చేసిన స్థానిక రాజకీయనేతలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నేడు ముగ్గురు నేతలను విడుదల చేయనుంది.

విడతల వారీగా కశ్మీర్​ రాజకీయనేతలు విడుదల..!

By

Published : Oct 10, 2019, 10:08 AM IST

Updated : Oct 10, 2019, 12:21 PM IST

కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుకు ముందురోజు నుంచి రాజకీయపార్టీల నేతలు సహా వివిధ వర్గాలను గృహ నిర్బంధంలో ఉంచింది ప్రభుత్వం. వీరిని విడతల వారీగా విడుదల చేయనుంది. గత నెల 21 పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన ఇమ్రాన్‌ అన్సారీ, సయ్యద్‌ అఖూన్‌ను ఆరోగ్య కారణాలతో విడుదల చేశారు.

తాజాగా పీడీపీ మాజీ ఎమ్మెల్యే యావర్‌మీర్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన నూర్ మొహమ్మద్​, పీపుల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన షోయబ్‌లోన్‌ను నేడు విడుదల చేయనుంది. శాంతికి విఘాతం కలిగించకుండా ఉంటామనే హామీపైనే వీరిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

అయితే జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్​ అబ్దుల్లా, ఒమర్​ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ విడుదలపై స్పష్టత లేదు.

ఇదీ చూడండి: కశ్మీర్​కు పర్యటక శోభ- నేటి నుంచి అనుమతి

Last Updated : Oct 10, 2019, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details