నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.
కశ్మీర్: 370, 35ఏ అధికరణలు రద్దు! - kashmir special status
ఊహాగానాలు నిజం అయ్యాయి. జమ్ముకశ్మీర్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన తీర్మానాలను రాజ్యసభలో ప్రవేశపెట్టింది.
రాజ్యసభలో రాజ్యాంగంలోని 370వ అధికరణ రద్దుకు అమిత్‌షా ప్రతిపాదన
అమిత్ షా ప్రకటన చేసిన వెంటనే... విపక్ష సభ్యులు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: కశ్మీర్ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో మార్కెట్లు